ప్రస్తుతం నయనతార మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తుంది. విగ్నేష్ శివన్ ని వివాహం చేసుకోవడం అలాగే, హనీమూన్ తో కాస్త సందడి చెయ్యడం, ఇప్పుడు షారుఖ్ తో కలిసి జవాన్ షూటింగ్ లో పాల్గొంటూ బిజీ అయ్యింది. అయితే నయనతార పెళ్ళికి ముందే చెన్నై లోని పోర్ష్ ఏరియా అయిన పోయెస్‌గార్డెన్‌లో 20 కోట్లతో ఇల్లు కొన్నట్లుగా వార్తలొచ్చాయి. రజినీకాంత్, జయలలిత, శశికళ ఇళ్ల దగ్గరలోనే పోయెస్‌గార్డెన్‌లో నయన్ ఇల్లు కొంది అన్నారు. కానీ ఇప్పుడు అదే ఏరియాలో నయనతార రెండు ఇళ్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
భర్త విగ్నేష్ శివన్ తో కలిసి ఉండేందుకు అనువుగా ఆ ఇళ్ల నిర్మాణం, అలాగే ఆ ఇంటి ఇంటీరియర్ ఉండేలా నయన్ ప్లాన్ చేసుకుందట. ఒక్కో ఇల్లు 8000 చదరపు అడుగుల స్థలంలో ఉంటుందని సమాచారం. ఒక్కో ఇంటిలో 1500 చదరపు అడుగుల స్థలంలో స్విమ్మింగ్‌పూల్ ని ఏర్పాటు చేయించుకుంటున్నారట. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్స్ ఇళ్లకు ఇంటీరియర్ డిజైన్ చేసే ఒక ప్రముఖ ఇంటీరియర్ సంస్థ నయన్ ఇళ్లకు ఇంటీరియర్ చేసేందుకు 25 కోట్లకు ఒప్పందం చేసుకున్నట్లు చెబుతున్నారు. అందులో నయన్-విగ్నేష్ కి ఓ స్పెషల్ లిఫ్ట్, అలాగే పనివాళ్ళకి ఓ స్పెషల్ లిఫ్ట్ ఉండేలా డిజైన్ చేస్తున్నారట. ఈ ఇళ్ల ఇంటీరియర్ పూర్తి కాగానే నయనతార - విగ్నేష్ దంపతులు ఆ ఇంటి గృహ ప్రవేశం చేస్తారని తెలుస్తుంది.