చిన్నారి పెళ్లి కూతురు ఇప్పుడు గ్లామర్ డాల్. ఒకప్పుడు బబ్లీ గా ఉండే అవికా గోర్ ఇప్పుడు స్లిమ్ గా నైస్ గా తయారయ్యింది. ట్రెడిషనల్ గర్ల్ కాస్తా అందాలు ఆరబొయ్యడానికి వెనుకాడడమే లేదు. వరస ప్రాజెక్ట్స్ తో బిజీ అయిన అవికా గోర్ కొన్నాళ్లుగా బాయ్ ఫ్రెండ్ మిలింద్ చాంద్వాని ని మెయింటింగ్ చెయ్యడమే కాదు, చట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. బాలీవుడ్ సీరియల్స్ లో నటించిన అవికా ఇప్పుడు హీరోయిన్ గా టాలీవుడ్ లో బిజీ బిజీగా నటించేస్తుంది.
నాగ చైతన్య తో థాంక్యూ మూవీలో వన్ అఫ్ ద హీరోయిన్ గా నటించిన అవికా గోర్ ఆ సినిమా సక్సెస్ కోసం ఎదురు చూస్తుంది. ఆది సాయి కుమార్ తో అమరన్ చేస్తుంది. అయితే తాజాగా తన బాయ్ ఫ్రెండ్ మిలింద్ చాంద్వాని తో కలిసి ఉన్న పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ పిక్ లో అవికా గోర్ మిలింద్ చాంద్వాని సెల్ఫీ తీసుకుంటూ హ్యాపీ గా కనిపిస్తున్నారు. తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంటాను, కానీ అది ఎప్పుడో చెప్పలేను అంటూ అవికా చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది.