Advertisementt

JGM కాన్సెప్ట్ అదేనా

Thu 07th Jul 2022 07:56 PM
puri jagannadh,vijay deverkonda,jana gana mana,jgm concept revealed  JGM కాన్సెప్ట్ అదేనా
JGM concept revealed JGM కాన్సెప్ట్ అదేనా
Advertisement
Ads by CJ

పూరి జగన్నాధ్ - విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కిన లైగర్ మూవీ ప్రమోషన్స్ ని ఓ సాంగ్ తో స్టార్ట్ చెయ్యబోతున్నారు. ఇప్పటివరకు విజయ్ దేవరకొండ సిక్స్ ప్యాక్ బాక్సింగ్ లుక్ నే చూపించిన టీం.. ఇప్పుడు సాంగ్ కోసం ఓ రొమాంటిక్ పోస్టర్ వదిలారు. అందులో విజయ్ దేవరకొండ - అనన్య పాండే రొమాంటిక్ గా కనిపించారు. ఇక లైగర్ షూటింగ్ అలా పూర్తయ్యిందో.. లేదో.. పూరి - విజయ్ కలిసి జన గణ మన మొదలు పెట్టేసారు. ఈమధ్యన మలయాళ హీరో పృథ్వీ రాజ్ సుకుమార్ జన గణ మన చూసాక పూరి - విజయ్ దేవరకొండ జన గణ మన ఎలా ఉండబోతుందో అనే ఆత్రుత మొదలయ్యింది.

అయితే JGM లో విజయ్ దేవరకొండ మిలట్రీ మ్యాన్ లా కనిపిస్తున్నారు. అంటే సరిహద్దుల్లో పోరాట దృశ్యాలతో ఈ జన గణ మన ఉండబోతుంది అని చాలామంది ఊహించుకుంటున్నారు. కానీ పూరి మాత్రం JGM ని వేరేలా రాసుకున్నారట. దేశంలో ప్రభుత్వం పడిపోయినప్పుడు దేశం బాధ్యతలు మిలట్రీ ఆధీనంలోకి వస్తే.. అప్పుడు  మిల‌ట్రీ ఎలాంటి బాధ్యత తీసుకోవాలి అనేది JGM లో చూపించబోతున్నారట పూరి. లైక్ పాకిస్తాన్ లో గవర్నమెంట్ పడిపోగానే దేశం సైన్యం చేతుల్లోకి వెళ్ళిపోయినట్టుగా అన్నమాట. సో దీనికి విజయ్ దేవరకొండ సారథ్యం వహిస్తాడు అన్నమాట. ఇదే పూరి - విజయ్ JGM కాన్సెప్ట్ అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

JGM concept revealed:

Puri - Vijay Deverkonda Jana gana Mana concept revealed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ