పదేళ్లుగా ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో లో ఇప్పుడు రకరకాల విషయాలు జరుగుతున్నాయి. నాగబాబు వెళ్ళిపోయినా రోజా ఒంటి చేత్తో జబర్దస్త్ ని లాక్కొచ్చింది. నాగబాబు లేకపోయినా రోజాకి జబర్దస్త్ కి టాప్ కమెడియన్స్ అంతా సపోర్ట్ గా నిలిచారు. తర్వాత రోజా మినిస్టర్ అయ్యింది, వెళ్ళిపోయింది. రోజా వెనుకే టాప్ కమెడియన్స్ జబర్దస్త్ ని వీడుతున్నారు. సుధీర్, ఆది, అవినాష్, అభి ఇలా అంతా వెళ్లిపోయారు. దానితో జబర్దస్త్ లో కళ పోయింది. సుధీర్, అది లు లేకపోవడంతో వరసగా సీరియల్ ఆర్టిస్ట్ లు జబర్దస్త్ స్టేజ్ పైకి ఎంట్రీ ఇస్తున్నారు.
మరోపక్క జబర్దస్త్ జేడ్జ్ లుగా చాలామంది మాజీ హీరోయిన్స్ వచ్చి వెళుతున్నారు. ఇంద్రజ, లైలా, శ్రద్ద దాస్, మనో ఇలా రకరకాలుగా కనిపిస్తున్నారు. తాజాగా జబర్దస్త్ జేడ్జ్ ప్లేస్ లోకి కోలీవుడ్ నటి ఖుష్బూ సుందర్ ఎంట్రీ ఇచ్చారు. ఖుష్బూ చాలా మోడరన్ గా, గ్లామర్ గా ఇంద్రజ పక్కనే ఉండి కమెడియన్స్ పై సెటైర్స్ కూడా వేశారు. ఖుష్బూ సరదాగా బుల్లెట్ భాస్కర్ పై వేసిన సెటైర్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఖుష్బూ అయినా పర్మినెంట్ జేడ్జ్ గా ఉంటుందా.. లేదంటే మిగతా వాళ్ళలా గెస్ట్ జేడ్జ్ గానే ఉంటుందా.. అనేది తెలియాల్సి ఉంది.