హైద్రాబాద్ ని నిన్నటినుండి వరుణ దేవుడు పట్టుకుని వదలడం లేదు. చిన్నగా మొదలైన చినుకులు చివరకి పెద్ద వర్షంలా మారి భాగ్యనగరాన్ని ముంచెత్తింది. మండుటెండలకి మాడిపోయిన ప్రజలు ఈ వర్షాన్ని ఎంజాయ్ చేస్తుంటే.. కొంతమంది ఈ వర్షాలను తిట్టిపోస్తున్నారు. అయితే హైదరాబాద్ వర్షాలను కళావతి కీర్తి సురేష్ తెగ ఎంజాయ్ చేస్తుంది. టాలీవుడ్ లో భోళా శంకర్, దసరా సినిమాల షూటింగ్స్ కోసం కీర్తి ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటుంది.
చిరు కి చెల్లెలిలా గా మెహెర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ లో కీర్తి సురేష్ నటిస్తుంది. ఇక నాని తో రెండోసారి దసరా సినిమాలో నటిస్తుంది. ఈ రెండు సినిమాల కోసం కీర్తి సురేష్ హైదరాబాద్ హోటల్ లో ఉంటుంది. హోటల్ రూమ్ లో ఉన్న బాల్కనీ లో కీర్తి సురేష్ రైన్ పడుతుండగా గొడుగు పట్టుకుని Keep calm and enjoy the rain! 🤍 అంటూ ఆ వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్న పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈమధ్యన కీర్తి సురేష్ ట్రెడిషనల్ లుక్ వదిలేసి.. గ్లామర్ గా తయారవడమే కాదు, గ్లామర్ గా ఉన్న ఫోటో షూట్స్ ని సోషల్ మీడియాలోనూ షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది.