రష్మీ గౌతమ్ కేవలం జబర్దస్త్ కి మాత్రమే యాంకర్ కాదు, ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా యాంకర్ గా వస్తుంది. అంటే సుధీర్ యాంకర్ గా వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ లో ఇప్పుడు సుధీర్ తప్పుకోగా.. రష్మీ ఆ ప్లేస్ లోకి వచ్చింది. ఇక హైపర్ ఆది జబర్దస్త్ నుండి సైడ్ తీసుకుని శ్రీదేవి డ్రామా కంపెనీలో డ్రామా చేస్తున్నాడు. వచ్చే ఆదివారం ఆషాడం అల్లుళ్ళ ప్రోగ్రాం శ్రీదేవి డ్రామా కంపెనీలో రాబోతుంది. అందుకు సంబందించిన ప్రోమో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆషాడం అంటే అత్తింటికి కొత్తల్లుళ్ళు వెళ్ళకూడదు, అలాగే కొత్త కోడళ్ళు కూడా అత్తింటికి వెళ్ళరు. దాని మీద ఫన్ చేసారు.
జబర్దస్త్ వర్ష లేచి.. అక్కా ఆషాడం కదా నువ్ ఇక్కడున్నావ్.. బావ అక్కడున్నాడు(సుధీర్ స్టార్ మా లోకి వెళ్లాడని) అంటూ సెటైర్ వేసింది. ఎవరే నీకు అక్క అంటూ రష్మీ కస్సున లేవగా.. దానికి హైపర్ ఆది అందరికి ఆషాడం నెల రోజులు ఉంటే.. నీకు మాత్రం ఓ ఏడాది ఉండేలా కనిపిస్తోందంటూ రష్మీ కి పంచ్ వేసిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇంకా ఈ షో లో నటి ప్రగతి రెచ్చిపోయి మాస్ డాన్స్ కి ఊరమాస్ స్టెప్స్ వేసింది. అలాగే రష్మీ డాన్స్ కూడా ఈ ప్రోమోలో హైలెట్ చేసారు.