మెగాస్టార్ చిరంజీవి-మోహన్ రాజ్ కాంబోలో మలయాళ హిట్ ఫిలిం లూసిఫర్ రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ మూవీ ఫస్ట్ లుక్ ఈమధ్యనే రిలీజ్ అయ్యింది. చిరంజీవి గాడ్ ఫాదర్ లుక్ లో మెగా ఫాన్స్ కి ట్రీట్ ఇచ్చారు. బ్లాక్ కలర్ డ్రెస్ లో మెగాస్టార్ హుందాగా కనిపిస్తున్నారు. ఈ సినిమాలో సర్ ప్రైజింగ్ గా చిరు కి సిస్టర్ గా పవర్ ఫుల్ హీరోయిన్ నయనతార నటిస్తుంది. నయన్ - చిరు అన్నాచెల్లెళ్లు గా ఉన్నప్పటికీ వారి మధ్యన ప్రేమ కన్నా ఎక్కువగా పగ ఉంటుంది. నయనతార చిరు ని అపార్ధం చేసుకుని ఆ కేరెక్టర్ లో నెగెటివిటీని చూపించే కేరెక్టర్ ఆమెది.
అయితే గాడ్ ఫాదర్ లో చిరు - నయనతార కాంబో సీన్స్ అద్భుతంగా వచ్చాయని, ఆ సీన్స్ హైలెట్ గా నిలవడం ఖాయమని అంటున్నారు. చిరు - నయనతార ఇద్దరూ పోటీపడి మరీ నటించారని, ఆలాగే చిరు - సల్మాన్ ఖాన్ కాంబో సీన్స్ కూడా బాగా వచ్చాయని అంటున్నారు. చిరు కి బాడీ గార్డ్ గా సల్మాన్ కనిపిస్తారు. పొలిటికల్ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. గాడ్ ఫాదర్ ని దసరా స్పెషల్ గా రిలీజ్ చెయ్యబోతున్నారు.