ఇప్పుడు ప్రస్తుతం జబర్దస్త్ vs కామెడీ స్టార్స్ అన్న రేంజ్ లో గొడవలు జరుగుతున్నాయి. జబర్దస్త్ లో ఫెమస్ అయిన కిర్రాక్ ఆర్పీ జబర్దస్త్, మల్లెమాల పై సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు. అక్కడ ఫుడ్ బాగోదు, బానిసల్లా పని చేయించుకుంటారు అంటూ మట్లాడేసాడు. దానితో ఆర్పీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా స్ప్రెడ్ అయ్యింది. అయితే ఆర్పీ కామెంట్స్ డిఫన్డ్ చెయ్యడానికే రామ్ ప్రసాద్, ఆది ఇద్దరూ రంగంలోకి దిగడమే కాదు, ఆ ఇంటర్వ్యూలో చాలా విషయాలను బయటపెట్టారు ఆ ఇద్దరు. ఆర్పీ చెప్పిన విషయంలో ఒక్కటీ నిజం లేదు అని, ఆర్పీ ఎందుకలా మాట్లాడాడో ఎవ్వరికి అర్ధం కావడం లేదు అని, అందుకే మేము వచ్చి వివరణ ఇస్తున్నామన్నారు.
అందులో భాగంగా ఆర్పీ ముందు నుండే విప్లవకారుడైతే ముందే జబర్దస్త్ నుండి వెళ్ళిపోవాలి. నాగబాబు గారు వెళ్ళగానే వాడు వెళ్ళిపోయాడు. అప్పట్లో నాగబాకు గారు కూడా చాలామంది కమెడియన్స్ వెళ్లిపోయారు. నేను సుధీర్ కూడా ఆయనతో వెళ్ళాలి అనుకున్నాము అంటూ ఆది సంచలన విషయాలు బయటపెట్టాడు. అప్పుడే మాకు అగ్రిమెంట్ విషయాలు తెలిసింది. అలాగే మాకు వేరే ఛానల్ షో లో కొన్ని విషయాలు నచ్చక నేను సుధీర్ పక్క ఛానల్ కి వెళ్లాలనే ఆలోచన మానుకున్నామంటూ ఆది చెప్పాడు. అంతేకాకుండా పక్క ఛానల్ వాళ్ళు 50 వేలు ఎక్కువ ఇస్తామంటూ తీసుకువెళ్లినా ఆ షో లైఫ్ ఎంత ఉంటుందో.. అందరికి తెలుసు, అదే జబర్దస్త్ ఎప్పటికీ నడిచే షో అంటూ ఆది చెప్పుకొచ్చాడు.