Advertisementt

కిర్రాక్ ఆర్పీ పై ముప్పేట దాడి

Tue 12th Jul 2022 05:07 PM
shaking seshu,jabardasth show,aadi,ram prasad,kiraak rp  కిర్రాక్ ఆర్పీ పై ముప్పేట దాడి
Shaking Seshu Sensational comments on Kiraak RP కిర్రాక్ ఆర్పీ పై ముప్పేట దాడి
Advertisement
Ads by CJ

జబర్దస్త్ లోనే ఫెమస్ అయ్యి, ఆస్తులని సంపాదించుకున్నాక జబర్దస్త్ ని దాని నిర్మాతలైన మల్లెమాల వాళ్ళని తిట్టిపోస్తున్న కిర్రాక్ ఆర్పీ కి కౌంటర్ ఎటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. మల్లెమాల వాళ్ళు ఫుడ్ బాగా పెట్టరు, అక్కడ బానిస బ్రతుకులే అంటూ ఓ ఇంటర్వ్యూలో పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. దానితో జబర్దస్త్ లో టాప్ కమెడియన్స్ అయిన ఆది, రామ్ ప్రసాద్ లు కిర్రాక్ ఆర్పీ మాట్లాడింది అంతా అబద్దం, ఆయన మంచోడే అసలెందుకు అలా మాట్లాడాడో అంటూ ఆర్పీ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

తాజాగా జబర్దస్త్ లో ఫెమస్ అయిన షేకింగ్ శేషు.. ప్రస్తుతం జబర్దస్త్ కి దూరంగా ఉన్నప్పటికీ.. ఆర్పీ మాట్లాడింది మొత్తం పచ్చి అబద్దాలే అని, అంతేకాకుండా ఆర్పీ మోసగాడు అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఆర్పీ జెడి చక్రవర్తితో దర్శకుడిగా ఓ మూవీ మొదలు పెట్టాడు. తన ఊరి అతన్నే నిర్మాతని చేసి మరీ ఆ సినిమా మొదలు పెట్టాడు. పూజా కార్యక్రమాలు మత్రమే జరిగిన ఆ సినిమా షూటింగ్ కి వెళ్లకుండానే ఆగిపోయింది. కారణం ఆర్పీ మూవీ మొదలు పెట్టకుండానే ఆఫీస్ అద్దెకి తీసుకోవడం, అలాగే అవీ ఇవీ అని ఓ 20 లక్షలు నిర్మాతచే ఖర్చు పెట్టించేసేసరికి అతను భయపడి ఆ సినిమా ఆపేసాడని, తర్వాత ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ఆర్పీ పై కంప్లైంట్ చేసారని సంచలన విషయాలు బయటపెట్టాడు శేషు.

అంతేకాకుండా హోమ్ టూర్ అంటూ ఆర్పీ చేసిన ఇల్లు అతనిది కాదని, ఒక ప్రఖ్యాత ఇంటీరియర్ డిజైనర్ ఇంటిని తన ఇంటిగా చూపిస్తూ ఆర్పి ఆ హోమ్ టూర్ చేసి, డబ్బు సంపాదించి జనాలని వెర్రిపుష్పాలని చేసాడు అంటూ షేకింగ్ శేషు ఆర్పీ పై రెచ్చిపోయి మాట్లాడాడు.

Shaking Seshu Sensational comments on Kiraak RP:

Shaking Seshu Made Sensational allegations on Kiraak RP

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ