రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కి తెలుగులోనే కాదు, బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. అక్కడి హీరోయిన్స్ ఎప్పుడెప్పుడు విజయ్ దేవరకొండ తో స్క్రీన్ షేర్ చేసుకుందామా.. అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే లైగర్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తో రోమాన్స్ చేస్తున్నాడు విజయ్. రీసెంట్ గా లైగర్ సాంగ్ రిలీజ్ అవ్వగా.. అందులో విజయ్ దేవరకొండ - అనన్య పాండే ల రొమాన్స్ అదిరిపోయింది. ఇక బాలీవుడ్ కుర్ర భామలు సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్, అలియా భట్ ఇలా విజయ్ దేవరకొండ అంటే క్రష్ అని చెప్పినోళ్లే.
తాజాగా కాఫీ విత్ కరణ్ షో లో బెస్ట్ ఫ్రెండ్స్ అయిన జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ పాల్గొన్నారు. కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నలకు ఈ హాటీస్ అందమైన జవాబులివ్వడమే కాదు, విజయ్ దేవరకొండ తో డేటింగ్ చేయాలనుంది అంటూ సారా అలీ ఖాన్ షాకిచ్చింది. కరణ్ జోహార్ ఈ షో లో సారా అలీఖాన్‌ను ఎవరితో డేటింగ్ చేయాలని అనుకుంటున్నావ్ అనగానే టక్కున విజయ్ దేవరకొండ అని చెప్పింది. దానితో కరణ్ జోహార్ జాన్వీ కపూర్ ని చూస్తూ నీకు కూడా విజయ్ అంటే ఇష్టం కదా అనగానే సారా అలీ ఖాన్ వెంటనే జాన్వీ ని చూసి నీకు విజయ్ దేవరకొండ అంటే ఇష్టమా అని అడిగింది.. ప్రస్తుతం సారా-జాన్వీ-కరణ్ జోహార్ ల కాఫీ విత్ కరణ్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.