Advertisementt

దిల్ రాజు వారసుడి పేరు లీక్

Wed 13th Jul 2022 06:20 PM
dil raju,dil raju son,tejaswi,dil raju second wife,anvy reddy  దిల్ రాజు వారసుడి పేరు లీక్
Dil Raju Naming His Son దిల్ రాజు వారసుడి పేరు లీక్
Advertisement
Ads by CJ

దిల్ రాజు - వంశి పైడిపల్లి - విజయ్ కాంబోలో తెలుగు, తమిళ్ లో వారసుడు సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దిల్ రాజు వారసుడు సినిమా లుక్ బయటికి వచ్చిన కొద్దిరోజులకే ఆయన ఇంటికి అసలైన వారసుడొచ్చాడు. దిల్ రాజు రెండో భార్య పండంటి మగబిడ్డని ప్రసవించింది. దిల్ రాజు మొదటి భార్య అనిత హార్ట్ ఎటాక్ తో మరణించడంతో ఆయన కూతురు హర్షిత బలవంతం మీద తేజస్వి ని దిల్ రాజు రెండో వివాహం చేసుకున్నారు. లాక్ డౌన్ లో సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన దిజు రాజుకి ఆయన భార్య వారసుడిని కానుకగా ఇచ్చింది.

దిల్ రాజు తన బిడ్డని చేతుల్లోకి తీసుకుంటున్న పిక్ సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అయ్యింది. దిల్ రాజుకి నిజమైన వారసుడొచ్చాడు అంటూ ప్రముఖులంతా ఆయనకి శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఇప్పుడు దిల్ రాజు తన కొడుక్కి ఎలాంటి పేరు పెడతాడో అనే ఆసక్తి, ఆత్రుత చాలామందిలో ఉంది. మరి దిల్ రాజు తన కొడుకు నామకరణం అంగరంగ వైభవంగా చేస్తాడు అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈలోపే దిల్ రాజు వారసుడి పేరు సోషల్ మీడియాలో లీకయ్యింది. దిల్ రాజు దంపతులు తమ కుమారుడికి అన్వై రెడ్డి అని పేరు పెడుతున్నట్లుగా తెలుస్తుంది. మరి దిల్ రాజు కొడుకు పేరు ప్రస్తుతానికి సస్పెన్స్ అయినా.. త్వరలోనే రివీలవుతుంది అంటున్నారు.

Dil Raju Naming His Son:

Dil Raju Son is likely to be named Anvy Reddy

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ