Advertisementt

కామెడీ ప్రియులకి షాక్: జబర్దస్త్ ఇకపై

Wed 13th Jul 2022 09:08 PM
jabardasth,extra jabardasth,anasuya,rashmi,comedy show  కామెడీ ప్రియులకి షాక్: జబర్దస్త్ ఇకపై
Jabardasth or Extra Jabardasth కామెడీ ప్రియులకి షాక్: జబర్దస్త్ ఇకపై
Advertisement
Ads by CJ

ఈటీవీలో అనసూయ యాంకర్ గా రోజా, నాగబాబు జెడ్జెస్ గా చమ్మక్ చంద్ర, వేణు, ధనరాజ్ లాంటి వాళ్లతో జబర్దస్త్ కామెడీ షో మొదలు పెట్టారు. అది కూడా గురువారం రాత్రి 9.30 నిమిషాలకు. జబర్దస్త్ స్టార్టింగ్ లోనే టాప్ టీఆర్పీ తో అదిరిపోయే సక్సెస్ అయ్యింది. దానితో కొన్ని ఎపిసోడ్స్ తర్వాత అనసూయ యాంకర్ గా భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చెయ్యగా.. అనసూయని స్మూత్ గా తప్పించి ఆ ప్లేస్ లోకి రష్మిని తీసుకుని వచ్చారు. దానితో అనసూయ షాక్. తర్వాత అనసూయకి మల్లెమాల కి మధ్యలో ఏం జరిగింధో.. ఒక ఏడాదిన్నర తర్వాత ఎక్స్ట్రా జబర్దస్త్ స్టార్ట్ చేసి అనసూయని గురువారం జబర్దస్త్ కి, రష్మిని శుక్రవారం ఎక్స్ట్రా జబర్దస్త్ కి యాంకర్స్ గా మార్చారు. అప్పటినుండి ఇప్పటివరకు గురు, శుక్రవారాల్లో జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ లు దూసుకుపోయాయి.

ఇకపై రెండు రోజులపాటు జబర్దస్త్ రాకపోవచ్చు అంటూ ఆ షో నుండి బయటికి వచ్చేసిన ఓ కమెడియన్ అంటున్నాడు. అంటే ప్రస్తుతం ఆది, సుధీర్, అభి లాంటి టీం లీడర్లు బయటికి వచ్చేసారు. స్కిట్స్ చేసేందుకు సరైన టీం లీడర్స్ కూడా లేరు. దానితో స్పెషల్ స్కిట్స్, సీరియల్ ఆర్టిస్ట్ ల స్కిట్స్ అంటూ జబర్దస్త్ ని నడిపిస్తున్నారు. మరోపక్క పర్మినెంట్ జెడ్జ్ లు దొరకడం లేదు. అందుకే రెండు రోజుల షోని ఒక రోజుకి కుదించి టాప్ లో ఉన్న కమెడియన్స్ తో జబర్దస్త్ ని ముగించాలని చూస్తున్నారట. అంటే గురు, శుక్ర వారాల్లో ఏదో ఒక షోని కంటిన్యూ చేసి ఓ షో ని తీసేద్దామనుకుంటున్నారట. అప్పుడు ఓ ఎపిసోడ్ కి సరిపోయే స్కిట్స్ పర్ఫెక్ట్ గా పడతాయని యాజమాన్యం ఆలోచనగా ఆ కమెడియన్ చెప్పడం కామెడీ ప్రియులకి షాకిచ్చింది. 

Jabardasth or Extra Jabardasth :

Jabardasth vs Extra Jabardasth 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ