నందమూరి నటసింహం బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘NBK107’. ఇంకా ఈ సినిమాకి పేరు పెట్టలేదనే విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిల్‌కి సంబంధించి సోషల్ మీడియాలో అనేకానేక పేర్లు వినిపిస్తున్న సమయంలో.. సరస్వతీ పుత్ర ‘రామజోగయ్య శాస్త్రి’ తాజాగా చేసిన ట్వీట్‌తో అందరూ ఈ సినిమా టైటిల్ విషయంపై ఓ క్లారిటీకి వచ్చేశారు. వీర సింహారెడ్డిగా బాలకృష్ణ కనిపించబోతోన్న ఈ చిత్రానికి ‘జై బాలయ్య’ అనేది టైటిల్ అనేలా శాస్త్రిగారి ట్వీట్ లీక్ చేసేసింది. దీంతో ‘జై బాలయ్య’ అనే టైటిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శాస్త్రిగారు క్యాజువల్‌గా పెట్టారో.. లేదంటే కావాలనే పెట్టారో తెలియదు కానీ.. ‘శాస్త్రిగారు టైటిల్ లీక్ చేశారహో..’ అంటూ నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
“Troy Michigan.. #JaiBalayya” అంటూ రామజోగయ్య శాస్త్రి తన ట్విట్టర్ అకౌంట్‌లో కూర్చుని పాటలు రాస్తున్న ఓ ఫొటోని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌తో ఇప్పుడు ఒక్కసారిగా ‘NBK107’ వార్తలలో హైలెట్ అవుతోంది. మరి ఈ సినిమాకి ‘జై బాలయ్య’ అనే టైటిల్ పెడతారా? లేదంటే బాలయ్యకి అచ్చివచ్చిన ‘సింహం’కి ఫిక్స్ అవుతారా? అనేది తెలియాల్సి ఉంది. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. దునియా విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. బాలయ్యను గోపీచంద్ మలినేని ఇంతకు ముందు చూడని సరికొత్త మాస్ అవతారంలో చూపిస్తున్నారనేది ఈ టీజర్‌తో తెలిసిపోయింది. నందమూరి అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతగానో వేచి చూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది.