పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘తమ్ముడు’ చిత్రం 23 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆ చిత్ర సంగీత దర్శకుడు రమణ గోగుల.. అప్పటి మెమరీస్‌ను గుర్తు చేసుకుంటూ ఓ వీడియోని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన సంచలన దర్శకుడు హరీష్ శంకర్.. ఓ ఆసక్తికర పోస్ట్‌ను రిప్లయ్‌గా ఇచ్చారు. దీంతో ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముందుగా రమణ గోగుల పోస్ట్ చేసిన వీడియో విషయానికి వస్తే.. ‘ఏదోలా ఉందీ వేళ నాలో..’ పాటను ప్లే చేస్తూ.. నా మ్యూజిక్‌ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. పవన్ కల్యాణ్‌గారితో చేసిన ‘తమ్ముడు’ చిత్రానికి.. అప్పుడే 23 సంవత్సరాలు పూర్తయ్యాయంటే నమ్మలేకపోతున్నాను. హేవ్ ఏ గ్రేట్ వీకెండ్.. అంటూ రమణ గోగుల ట్వీట్‌లో పేర్కొన్నారు.
రమణ గోగుల చేసిన ఈ పోస్ట్‌కు మెగాభిమానులెందరో రిప్లయ్ ఇస్తూ.. అప్పటి విషయాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ ట్వీట్‌కు రిప్లయ్ ఇస్తూ.. ‘‘అద్భుతం సార్.. అప్పటి జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను..’’ అంటూ హరీష్ శంకర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో ఇప్పుడు మెగాభిమానులందరూ.. హరీష్ శంకర్ చేస్తున్న ‘భవదీయుడు భగత్‌సింగ్’ చిత్రంలో మళ్లీ ‘తమ్ముడు’ చిత్రంలోని రమణ గోగుల పాడిన పాటనేమైనా పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నాడా? అనేలా కామెంట్స్ చేస్తున్నారు. లేదంటే ఎందుకు కలుస్తానని అని ఉంటాడు? అని ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం హరీష్ శంకర్ నిర్మాతగా మారి వెబ్ సిరీస్‌లు చేస్తున్న విషయం తెలిసిందే. అటువంటి వెబ్ సిరీస్‌కి ఏమైనా సంగీతం అందించేందుకు రమణ గోగులను కలుస్తాడా? ఏ విషయం తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.