నటుడు, సింగర్, బిగ్ బాస్ ఫేమ్ నోయెల్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నోయెల్ తండ్రి ఈ శనివారం రాత్రి కన్ను మూయడంతో నోయెల్ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. నోయెల్‌కు తండ్రితో ఎంతో అనుబంధం ఉంది. ఆయనతో కలిసి పంచుకున్న చాలా వీడియోలను నోయెల్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు. బిగ్ బాస్ కి వెళ్లిన కొత్తలో ప్రమోషన్స్ కోసం తండ్రి తో చేసిన వీడియో ని సోషల్ మీడియాలో ఉంచింది ఆయన పిఆర్ టీం
ఇక నోయెల్ బిగ్ బాస్ కి వెళ్ళకముందు ప్రేమ వివాహం చేసుకున్న ఎస్తర్ తో విడిపోయి విడాకులు తీసుకున్నాడు. సింగర్ గా గుర్తింపు పొందిన నోయెల్ నటుడిగాను పలు సినిమాలు చేసాడు. బిగ్ బాస్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులని ఆకట్టుకున్న నోయెల్ తండ్రి మరణంతో కుంగిపోయినట్లు తెలుస్తోంది. నోయెల్ తండ్రి మరణ వార్త విన్న పలువురు స్నేహితులు, తోటి సింగర్స్ ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు.