చాలామంది కమెడియన్స్ జబర్దస్త్ ద్వారా సక్సెస్ అవడమే కాదు, ఆ క్రేజ్ తో బయట సినిమాల్లోనూ, అలాగే వేరే ప్రోగ్రామ్స్ లో చేస్తూ విపరీతంగా సంపాదిస్తున్నారు. జబర్దస్త్ కమెడియన్స్ అంతా కొత్త ఇల్లు, కార్లు కొనుక్కుని మరీ బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రామ్ ప్రసాద్ కూడా అదే రివీల్ చేసాడు. తాను జబర్దస్త్ ద్వారా వచ్చిన డబ్బుతో రెండిళ్ళు కొనుక్కోవడమే కాకుండా స్థలాలు కూడా కొన్నాను అని చెప్పిన రామ్ ప్రసాద్ శ్రీను కూడా ఓ ఇల్లు కొనుక్కుని కారు, రెండుమూడు ప్లాట్స్ కొనుక్కున్నాడు అని, సుధీర్ ఓ ఇల్లు, విల్లా కూడా కొన్నాడని, ఆది జబర్దస్త్ కి వచ్చే ముందు మూడెకరాల పొలం అమ్మి 20 లక్షల అప్పు తీర్చి.. తర్వాత జబర్దస్త్ లో సంపాదించుకుని 16 ఎకరాలు పొలం కొన్నాడంటూ రామ్ ప్రసాద్ తాము జబర్దస్త్ షో ద్వారా ఎంతగా సంపాదించామో అనే విషయాన్ని రివీల్ చేసాడు.
అంతేకాకుండా పిల్లలని మంచి స్కూల్స్ లో చదివించడం, ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మెయింటింగ్ చేస్తున్నట్టుగా ఆటో రామ్ ప్రసాద్ రివీల్ చేసాడు. ఆర్పీ లాంటి వాళ్ళు ఏమి కొనుక్కోకపోతే ఎవరూ ఏమి చేయలేము అని, జబర్దస్త్ మాకు లైఫ్ ఇచ్చింది అని రామ్ ప్రసాద్ ఓపెన్ కామెంట్స్ చేసాడు. ప్రస్తుతం జబర్దస్త్ vs కిర్రాక్ ఆర్పీ అన్నటుగా సోషల్ మీడియాలో ఓ యుద్ధ వాతావరణం కనబడుతుంది.