కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ప్రజలని భయభ్రాంతులని చేసింది. కరోనా విలయతాండవంలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. తర్వాత థర్డ్ వేవ్ పెద్దగా ప్రభావం చూపకపోయినా.. మళ్లీ ఇప్పుడు ఫోర్త్ వేవ్ సూచనలు కనిపిస్తున్నాయి. గత నెలలో బాలీవుడ్ ప్రముఖులు కరోనా బారిన పడి కోలుకోగా.. ఈమధ్యన కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కరోనా బారిన పడింది.
తాజాగా ప్రముఖ దర్శకులు మణిరత్నం కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన పొన్నియన్ సెల్వన్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్నారు. ఈ మధ్యనే ఆయన పొన్నియన్ సెల్వన్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఇంతలోపులో ఆయన కి కరోనా సోకగా.. ప్రస్తుతం ఆయన్ని చెన్నై లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేర్పించినట్లుగా తెలుస్తుంది. అయితే మణిరత్నం హెల్త్ అప్ డేట్ ఇంకా బయటికి రాలేదు. ఆసుపత్రి వర్గాలు కూడా మణిరత్నం హెల్త్ విషయాలు వెల్లడించలేదు. మణిరత్నం భార్య సుహాసిని త్వరలోనే ఆయన హెల్త్ విషయాలను మీడియా కి చెప్పే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.