ఈటీవీలో ప్రసారమవుతున్న డాన్స్ షో, కామెడీ షోస్ కి విపరీతమైన పాపులారిటీ ఉంది. ఢీ డాన్స్ షో తో చాలామంది డాన్స్ మాస్టర్ టాలీవుడ్ ని ఏలుతుంటే.. జబర్దస్త్ కామెడీ షో తో కమెడియన్స్ విచ్చలవిడిగా పుట్టుకొచ్చారు. అయితే ఇప్పుడు ఈ టివి షోస్ నుండి కమెడియన్స్ ని, జెడ్జెస్ ని పక్క ఛానల్స్ కి లాగేందుకు భారీ పారితోషకాలు ఆఫర్ చేస్తున్నారు. ఇప్పటికే జబర్దస్త్ నుండి స్టార్ మా కి చాలామంది కమెడియన్స్ వెళ్లిపోయారు. ఢీ షో నుండి శేఖర్ మాస్టర్ జేడ్జ్ స్థానం నుండి తప్పుకున్నారు. తర్వాత సుధీర్ మానేసాడు.
అయితే శేఖర్ మాస్టర్ ఢీ షోలో మానెయ్యడం పై రకరకాల ఊహాగానాలు నడిచాయి. అక్కడ ఆయనకి అవమానం జరిగిన కారణంగానే ఆయన బయటికి వచ్చారనే ప్రచారం జరిగింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శేఖర్ మాట్లాడుతూ ఢీ షో ఎందుకు మానేశానంటే.. ఢీ షో నుండి సినిమాల వలన కొద్దిరోజులు బ్రేక్ తీసుకున్నాను, తర్వాత స్టార్ మా కామెడీ స్టార్స్ జేడ్జ్ గా ఆఫర్ వచ్చింది. ఇక్కడ అగ్రిమెంట్ చేశాను. అందుకే ఢీ షో కి వెళ్ళలేకపోయాను అంటూ శేఖర్ ఢీ ఎందుకు వదలాల్సి వచ్చిందో చెప్పుకొచ్చారు. నాగబాబు గారితో కామెడీ స్టార్స్ లో జేడ్జ్ గా పక్కన కూర్చోవడం థ్రిల్లింగ్ గా ఉంది అన్నారు శేఖర్ మాస్టర్.