మెగాస్టార్ చిరంజీవి - బాబీ కాంబోలో తెరకెక్కుతున్న Mega 154 షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది. వాల్తేర్ వీరయ్యగా చిరు మాస్ లుక్ లో అదరగొట్టేస్తున్నారు. ఈ సినిమాలో చిరు కి జోడిగా శృతి హాసన్ నటిస్తుంది. అయితే ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. గత వారమే రవితేజ Mega 154 షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. చిరు-రవితేజ కాంబోలో ఓ మాస్ సాంగ్ ని కూడా బాబీ ప్లాన్ చేశారట. అంతేకాకుండా Mega 154 పై ఇప్పుడొక ఆసక్తికర న్యూస్ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది.
పార్లమెంట్ సభ్యురాలు, మాజీ హీరోయిన్ సుమలత Mega 154 లో కీలక పాత్రను చేస్తున్నట్లు ఓ న్యూస్ లీకైంది. సుమలత రోల్ సినిమాను మలుపు తిప్పే విధంగా ఉండబోతుందని అంటున్నారు. అంతేకాకుండా సుమలత రవితేజ కి తల్లిగా కనిపిస్తుంది అని, సుమలత కారణంగానే రవితేజ - చిరు కలుస్తారని, సుమలత-రవితేజ-చిరు ఎపిసోడ్ ఎమోషనల్ గా ఉంటుంది అంటూ ఆ వార్త సారాంశం. క్రేజీ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న వాల్తేర్ వీరయ్య తో చిరు - బాబీ ఎన్ని అద్భుతాలు సృష్టిస్తారో చూడాలి.