సమంత - నాగ చైతన్య విడాకులు తీసుకుని విడిపోయి అప్పుడే పది నెలలు గడిచిపోయింది. గత ఏడాది అక్టోబర్ లో ఈ లవ్లీ కపుల్ విడిపోయి వారు బాధపడటమే కాకుండా, చాలామందిని బాధపెట్టారు. అప్పటి నుండి ఎవరి కెరీర్ లో వాళ్ళు బిజీ అయ్యారు. విడాకుల తర్వాత సమంత మీడియా లో బాగా ఎక్స్పోజ్ అయ్యింది. నెగెటివ్ కామెంట్స్ తో సమంత బాగా ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఇక తాజాగా సమంత కాఫీ విత్ కరణ్ షో లో సమంత తన డివోర్స్, అలాగే 250 కోట్ల భరణం తీసుకుంది అనే ప్రచారం పై ఓపెన్ అయ్యింది. కరణ్ జోహార్ మీ భర్త నాగ చైతన్య అని సంభోదించగా.. భర్త కాదు, మాజీ భర్త అని చెప్పిన సమంత ని కరణ్ జోహార్ విడాకుల తర్వాత ఎలాంటి సమస్యలను ఫేస్ చేసారు అని అడిగాడు.
నేను విడాకులు తీసుకున్న తరువాత చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. నేను నా జీవితంలో జరిగిన చాలా విషయాలను వెల్లడించే విడిపోయాను. నా గురించి వచ్చిన నెగెటివ్ కామెంట్స్ పై ఎక్కడా ఫిర్యాదు చెయ్యలేదు, సోషల్ మీడియాలో ట్రోల్ చేసేవారు, అప్పట్లో వాటిపై స్పందించేందుకు నా దగ్గర ఆన్సర్స్ లేవు. నాకు భరణంగా చైతు 250 కోట్లు ఇచ్చాడని ప్రచారం జరిగింది. అది అంతా అబద్దం అని లాస్ట్ కి మీడియానే రియలైజ్ అయ్యింది. దానితో ఆ పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది. ఇక ప్రస్తుతం తామిద్దరి మధ్యన తత్సంబందాలు లేవని, ఇద్దరినీ ఒకే గదిలో పెడితే అక్కడ కత్తులు దాచేయాలంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సమంత ఫ్యూచర్ లో చైతు తో ఫ్రెండ్లీ గా ఉంటానేమో తెలియదని చెప్పింది.