Advertisementt

ఆసుపత్రిలో హీరో శ్రీ విష్ణు

Fri 22nd Jul 2022 10:19 PM
actor sree vishnu,hospital,dengue fever  ఆసుపత్రిలో హీరో శ్రీ విష్ణు
Actor Sree Vishnu hospitalised ఆసుపత్రిలో హీరో శ్రీ విష్ణు
Advertisement
Ads by CJ

హీరో శ్రీ విష్ణు ఈ మధ్యనే భళా తందనానా అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఇక ఇప్పుడు అల్లూరి తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ఈమధ్యనే అల్లూరి టీజర్ రిలీజ్ అయ్యింది. అయితే తాజాగా శ్రీ విష్ణు ఆసుపత్రిలో జాయిన్ అవడం ఆయన ఫాన్స్ ని కంగారు పడేలా చేసింది. శ్రీ విష్ణు గత కొన్ని రోజులుగా ఫీవర్ తో బాధపడుతున్నాడని, అది డెంగ్యూ ఫీవర్ అయినప్పటికీ.. శ్రీవిష్ణు ఇంట్లోనే ఉండి డాక్టర్స్ తో కాంటాక్ట్ లో ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నాడని తెలుస్తుంది. 

కానీ జ్వరం తగ్గకపోగా.. బ్ల‌డ్‌ ప్లేట్ లెట్స్ దారుణంగా పడిపోవడంతో.. శ్రీవిష్ణు ని వెంట‌నే ఫ్యామిలీ మెంబెర్స్ హైద‌రాబాద్ లోని ఓ ప్ర‌ముఖ హాస్పిట‌ల్‌లో జాయిన్ చేశారు. ప్రస్తుతం డాక్ట‌ర్స్ అబ్జర్వేషన్ లో శ్రీవిష్ణు కి చికిత్స అందుతోంది అని తెలుస్తుంది. శ్రీ విష్ణు ఆరోగ్యం విషయంలో ఆయన ఫాన్స్ ఆందోళ పడుతున్నారు. శ్రీ విష్ణు హెల్త్ విషయాలు డాక్టర్స్ వెల్లడించాల్సి ఉంది.

Actor Sree Vishnu hospitalised:

Hero Sree Vishnu hospitalised due to dengue

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ