రణబీర్ కపూర్ - వాణి కపూర్ జంటగా కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో తెరకెక్కిన షంషేరా నిన్న విడుదలైంది. భారీ ప్రమోషన్స్ భారీ అంచనాల నడుమ ఏకంగా 4000 స్క్రీన్స్‌లో సినిమాని విడుదల చేశారు. 150కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై ట్రేడ్ లోను, ఆడియన్స్ లోను అంచనాలు బాగా పెరిగాయి. అందుకు తగ్గట్టుగా రణబీర్ కపూర్ - వాణి కపూర్ కెమిస్ట్రీ ప్రమోషన్స్ లో హైలెట్ అయ్యింది. షంషేరా హిట్ అవుతుంది.. మళ్ళీ బాలీవుడ్ బాక్సాఫీసు కళకళలాడుతుంది అనుకుని నిపుణులు అంచనా వేశారు. సౌత్ లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీస్ బాలీవుడ్ బాక్సాఫీసుని షేక్ చెయ్యడంతో.. ప్రతి వారం హిందీలో రిలీజ్ అయ్యే సినిమాలపై నార్త్ ఆడియన్స్ అంచనాలు పెట్టుకుంటున్నారు. కానీ ఈసారి కూడా ఆడియన్స్ అంచనాలు అందుకోవడంలో షంషేరా పూర్తిగా విఫలం అయ్యింది..
మొదటి రోజు 10.25కోట్ల కలెక్షన్స్ రాబట్టినా.. ఆ సినిమాకి వచ్చిన టాక్ తో ఫస్ట్ డే చాలా స్క్రీన్స్ లో ఆక్యుపెన్సీ లేక సినిమా ప్రదర్శన నిలిపివేశారు డిస్ట్రిబ్యూటర్స్. ఎక్కువగా ముంబైలో షంషేరా షోలు ఎక్కువగా రద్దయినట్టు సమాచారం. సినిమా లో కంటెంట్ లేదు, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ లేవు అంటూ ఆడియన్స్ పెదవి విరుస్తున్నారు. మరి ఈ సినిమా ప్లాప్ ఎఫెక్ట్ రణబీర్ కపూర్ నెక్స్ట్ పాన్ ఇండియా ఫిలిం బ్రహ్మాస్త్ర పై పడుతుందేమో.. అది కూడా రిలీజ్ కి రెడీ అవుతుంది అంటూ రణబీర్ అభిమానులు ఆందోళన పడుతున్నారు.