Advertisementt

అనసూయ ప్లేస్ లో ఎవరొస్తారో?

Mon 25th Jul 2022 09:27 AM
anasuya,jabardasth comedy show,jabardasth,manjusha,rashmi  అనసూయ ప్లేస్ లో ఎవరొస్తారో?
Anasuya Bharadwaj quits Jabardasth అనసూయ ప్లేస్ లో ఎవరొస్తారో?
Advertisement
Ads by CJ

యాంకర్ అనసూయ గత తొమ్మిదేళ్లుగా జబర్దస్త్ యాంకర్ గా దున్నేసింది. కమెడియన్స్ తో సరదాగా స్కిట్స్ చెయ్యడం, స్టేజ్ మీదకి రాగానే మాస్ అండ్ క్లాస్ స్టెప్స్ తో అదరగొట్టెయ్యడం, మధ్యలో అందమైన డ్రెస్సులతో గ్లామర్ ఒలకబొయ్యడం వంటి విషయాలతో జబర్దస్త్ కామెడీ షో కే హైలెట్ గా నిలిచింది. అలాంటి జబర్దస్త్ షో కి అనసూయ గుడ్ బై చెప్పబోతోంది. రేపు గురువారం ఎపిసోడ్ తో అనసూయ వెళ్ళిపోతుంది. ఆ ఎపిసోడ్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది కూడా. అనసూయ ఎమోషనల్ గా అందరికి సెండాఫ్ ఇవ్వగా ఇంద్రజ లాంటి వాళ్ళు కన్నీళ్లు పెట్టుకోగా.. చంటి, వెంకీ లాంటివాళ్లు ఓ మూడు రోజులు మా కోసం స్పెండ్ చెయ్యలేవా అని అడుగుతున్నారు. అయినా అనసూయ వెళ్లిపోవడానికే రెడీ అయ్యింది. 

మరి అందమైన, గ్లామర్ భామ అనసూయ వెళ్ళిపోతే ఇప్పుడు జబర్దస్త్ యాంకర్ గా ఎవరు వస్తారు.. అనే విషయంలో అందరిలో ఆసక్తి నెలకొంది. ఈమధ్యన శ్రీముఖిని సంప్రదించగా.. ఆమె నో చెప్పింది అన్నారు. ఇంతలోపులో యాంకర్ మంజూష అనసూయ ప్లేస్ ని భర్తీ చేసే అవకాశం ఉంది అన్నారు. తర్వాత అందరూ సైలెంట్ అయ్యారు. మరి అనసూయ ప్లేస్ లో అంత గ్లామర్ షో చేసి, అంత యాక్టీవ్ గా కమెడియన్స్ తో కలిసిపోయి, జెడ్జెస్ తో నవ్వించగలిగే ఆ సత్తా ఉన్న యాంకర్ ఎవరో అనే విషయంలో మరో మూడు రోజులు సస్పెన్స్ కొనసాగుతుంది. వచ్చే గురువారం నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమోలో అనసూయ ప్లేస్ లోకి వచ్చే ఆ కొత్త యాంకర్ ఎవరో తెలుస్తుంది. కొత్తగా లేదు అంటే రష్మిని జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ కి కంటిన్యూ చేసే అవకాశం లేకపోలేదు.

Anasuya Bharadwaj quits Jabardasth:

New Anchor Replaced Anasuya in Jabardasth Comedy Show

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ