Advertisementt

చైతు కి దిల్ రాజు కి హోల్ సేల్ షాక్

Mon 25th Jul 2022 02:52 PM
dil raju,naga chaitanya,vikram kumar,thank you  చైతు కి దిల్ రాజు కి హోల్ సేల్ షాక్
Naga Chaitanya Gets Big Shock with Thank You చైతు కి దిల్ రాజు కి హోల్ సేల్ షాక్
Advertisement
Ads by CJ

నాగ చైతన్య బంగార్రాజు తో ఫ్యామిలీ హిట్ కొట్టిన తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ మూవీ చేసాడు. మనం లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ అవడంతో థాంక్యూ మూవీ పై మొదట్లో అంచనాలు బావున్నాయి. అందులోనూ దిల్ రాజు లాంటి నిర్మాత నుండి వస్తున్న మూవీ కావడంతో థాంక్యూ హిట్ పక్కా అనుకున్నారు. కానీ నాగ చైతన్య థాంక్యూ రిలీజ్ టైం కి పరిస్థితులు తారుమారు అయ్యాయి. చైతు క్రేజ్ తో మంచి ఓపెనింగ్స్ వస్తాయనుకుంటే.. టాక్ తెలియకుండానే ప్రేక్షకులు థాంక్యూ ని తిప్పికొట్టారు. చైతు కెరీర్ లోనే వరెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి, తర్వాత శనివారం, ఆదివారం కూడా థాంక్యూ సినిమా చూడడానికి ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఫలితం.. లక్షల్లో కలెక్షన్స్ వస్తున్నాయి. 

కనీసం వీకెండ్ లో అయినా థాంక్యూ కలెక్షన్స్ బావుంటాయి అనుకుంటే.. ఫస్ట్ వీకెండ్ లో ఘోరంగా 3.60 కోట్ల షేర్ రావడం అక్కినేని ఫాన్స్ కి బిగ్ షాక్ నిచ్చింది. అటు చైతు కూడా థాంక్యూ టాక్, థాంక్యూ కలెక్షన్స్ తో డిస్పాయింట్ అయినట్లుగా తెలుస్తుంది. 25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన థాంక్యూ కి 5 నుండి 6 కోట్ల కలెక్షన్స్ కూడా రావంటున్నారు. అంటే బయ్యర్లు ఏకంగా 20 కోట్ల నష్టాలూ పాలవ్వాల్సిందే అంటున్నారు. మరి రాజు కి ఇది మాములు దెబ్బకాదు, భారీ దెబ్బే.  

Naga Chaitanya Gets Big Shock with Thank You:

Dil Raju Gets Big Shock with Thank You

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ