Advertisementt

బింబిసార ఈవెంట్: ఎన్టీఆర్ ఫాన్స్ వెయిటింగ్

Mon 25th Jul 2022 05:44 PM
jr. ntr,kalyan ram,ntr,balakrishna,bimbisara pre-release event,bimbisara  బింబిసార ఈవెంట్: ఎన్టీఆర్ ఫాన్స్ వెయిటింగ్
Bimbisara event is going to be NTR first public appearance after RRR బింబిసార ఈవెంట్: ఎన్టీఆర్ ఫాన్స్ వెయిటింగ్
Advertisement
Ads by CJ

కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం బింబిసారా రిలీజ్ కి రంగం సిద్ధం అవుతుంది. కళ్యాణ్ రామ్ బింబిసారుడిగా రాజు గెటప్ అలాగే మోడరన్ గెటప్ లో కనిపించబోతున్న ఈ సినిమాలో కేథరిన్ థెరిసా హీరోయిన్ గా నటించింది. మల్లాడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఇప్పుడు ఎన్టీఆర్ ఫాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఫాన్స్ తో పాటు నందమూరి ఫాన్స్ కూడా వెయిటింగ్. ఎందుకంటే కళ్యాణ్ రామ్ కోసం ఎన్టీఆర్ ఈవెంట్ కి వస్తారు. ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ వస్తే.. ఆయన కొత్త లుక్, ఆయన ఎంత వెయిట్ లాస్ అయ్యారో ఈజీగా ఫాన్స్ కనిపెట్టేస్తారు.

ఎన్టీఆర్ చాలా రోజులుగా ఫాన్స్ కి కనిపించడం లేదు. ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ చాలా రేర్ గా ఫాన్స్ కి కనిపించారు. ఆఖరికి బర్త్ డే రోజున కూడా ఎన్టీఆర్ కనిపించలేదు, NTR30 ఓపెనింగ్ అవుతుందేమో అక్కడ ఎన్టీఆర్ ని చూడొచ్చు అనుకున్నారు. అది జరగలేదు. కానీ ఇప్పుడు పాన్ ఇండియా మూవీ బింబిసారా ఈవెంట్ ఈ నెల 29 న జరుగుతుంది. ఆ ఈవెంట్ కోసం ఎన్టీఆర్ తప్పకుండా వస్తారని తెగ వెయిట్ చేస్తున్నారు. అంతేకాకుండా నందమూరి ఫాన్స్ కూడా బాలయ్య - ఎన్టీఆర్ - కళ్యాణ్ రామ్ కలయిక కోసం చూస్తున్నారు. అది బింబిసారా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సాధ్యమయ్యే అవకాశం ఉండడంతో వాళ్ళూ ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు.

Bimbisara event is going to be NTR first public appearance after RRR:

Jr. NTR to grace Bimbisara pre-release event?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ