Advertisementt

ప‌ఠాన్: మైండ్ బ్లో లుక్ లో దీపిక

Mon 25th Jul 2022 07:24 PM
pathaan,deepika padukone,siddarth anand,yash raj films  ప‌ఠాన్: మైండ్ బ్లో లుక్ లో దీపిక
Deepika has a fierce role in Pathaan that will blow everyone mind: Siddharth Anand ప‌ఠాన్: మైండ్ బ్లో లుక్ లో దీపిక
Advertisement
Ads by CJ

షారుఖ్ ఖాన్‌, దీపిక ప‌దుకోన్‌, జాన్ అబ్ర‌హామ్ కలయికలో సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న సినిమా ప‌ఠాన్ సినిమా. షారుఖ్‌ఖాన్ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి ముప్పై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా విడుద‌ల చేసిన ప‌ఠాన్‌లో షారుఖ్ లుక్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. జులై 25కి ప‌ఠాన్‌ని మొద‌లుపెట్టి ఆరె నెల‌లైంది. ఈ సంద‌ర్భంగా ఈ సినిమాలో అద్భుత‌మైన పాత్ర‌లో న‌టించిన దీపిక ప‌దుకోన్ గ్లింప్స్ విడుద‌ల చేశారు మేక‌ర్స్.

సిద్ధార్థ్ ఆనంద్ మాట్లాడుతూ దీపిక ప‌దుకోన్ మాసివ్‌, మాసివ్ స్టార్. ప‌ఠాన్‌లో ఆమె ప్రెజెన్స్ మ‌రింత ఎగ్జ‌యిటింగ్‌గా, సూప‌ర్బ్ గ్రాండ్‌గా ఉంటుంది. ఇప్ప‌టిదాకా ప‌ఠాన్‌లో ఆమె లుక్ ఎవ‌రూ చూడ‌లేదు. అందుకే మేం గ్లింప్స్ ని స్పెక్టాకిల్ వేలో రిలీజ్ చేయాల‌నుకున్నాం. ఆమె చేసిన పాత్ర చూస్తే ఎవ‌రికైనా మైండ్ బ్లో అవ్వాల్సిందే. ఈ సినిమాలో ఆమె అయ‌స్కాంతంలా అంద‌రినీ ఆక‌ర్షిస్తుంది. ఆమె కెరీర్ తొలినాళ్ల‌లో ఆమెతో క‌లిసి ప‌నిచేశాను. కానీ రోజులు గ‌డిచే కొద్దీ ఆమెను ఆమె తీర్చిదిద్దుకున్న విధానం న‌న్ను విస్మ‌యానికి గురి చేసింది. ఆమె ఇప్పుడు సంపూర్ణ‌మైన వైవిధ్య‌మైన న‌టి. ఆక‌లి మీదున్న న‌టి. ప‌ఠాన్‌లో ఆమె ఫ‌స్ట్ లుక్‌ని చూసిన ప్ర‌తి ఒక్క‌రూ నా మాట‌ల్లో ఉన్న లోతును అర్థం చేసుకుంటారు అని అన్నారు.

దీపిక గురించి సిద్ధార్థ్ ఇంకా చెబుతూ దీపిక రేర్ యాక్ట‌ర్‌. ప్యాన్ ఇండియా రేంజ్ అప్పీల్ ఉన్న ఆర్టిస్ట్ ఆమె. సినిమాకు ఆమె అతి పెద్ద యుఎస్‌పీ. ఈ రోల్‌కి భార‌త‌దేశంలో అత్యంత గ్రేస్ ఉన్న, ఆబాల‌గోపాలాన్ని ఆక‌ట్టుకున్న న‌టిని ఎంపిక చేసుకోవాల‌నుకున్నాం. కానీ మాకు దీపిక ప‌దుకోన్ క‌న్నా అత్యుత్తమ‌మైన యాక్ట‌ర్ మ‌రొక‌రు క‌నిపించ‌లేదు. ఆమె రోల్‌ని బిగ్ స్క్రీన్ మీద ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆత్రుత‌తో వెయిట్ చేస్తున్నాం. 2023, జన‌వ‌రి 25న బిగ్ స్క్రీన్స్ మీద ప‌ఠాన్‌లో ఆమె కేర‌క్ట‌ర్‌ని ప్ర‌తి ఒక్క‌రూ చూసి తీరాల్సిందే అని అన్నారు.

Deepika has a fierce role in Pathaan that will blow everyone mind: Siddharth Anand:

Pathaan is set to release on January 25, 2023

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ