ఇప్పటివరకు కళ్యాణ్ రామ్ బింబిసారా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వస్తారంటూ ఎన్టీఆర్ ఫాన్స్ ఊహించుకుని సంతోష పడడమే కానీ, కన్ ఫర్మ్ గా న్యూస్ ఇవ్వలేదు. కానీ ఈ రోజు VASTUNNADU 🔥💥 అంటూ ఎన్టీఆర్ బింబిసారా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నట్లుగా మేకర్స్ కన్ ఫర్మ్ చేసి అప్ డేట్ ఇచ్చారు. దానితో ఎన్టీఆర్ ఫాన్స్ కి పట్టరాని సంతోషం వచ్చేసింది. కారణం ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ తర్వాత సినిమా కోసం ఎలా ప్రిపేర్ అవుతున్నాడో.. మధ్యలో మాల వేసుకున్న ఎన్టీఆర్ లుక్ ఇప్పుడు ఎలా ఉందో అనే క్యూరియాసిటిలో ఉన్నారు ఆయన ఫాన్స్.
అందుకే లాంగ్ గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ ఇవ్వబోయే పబ్లిక్ అప్పీరియన్స్ కోసం ఫాన్స్ అంతలా వెయిట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు టైగర్ దిగుతున్నాడు ఫెస్టివల్ కి రెడీ కండి.. ఈవెంట్ కి తరలి రండి అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ హంగామా మొదలు పెట్టేసారు. మరి ఈవెంట్ లో ఎన్టీఆర్ ని చూసి ఆయన ఫాన్స్ ఎంతగా ఎగ్జైట్ అవుతారో చూడాలంటే ఈ నెల 27 వరకు వెయిట్ చెయ్యాల్సిందే.