సెలెబ్రిటీ జంటలు కొంతమంది ప్రేమలో ఉన్నప్పుడే అభిప్రాయం భేదాలతో బ్రేకప్ చేసుకుంటే.. కొంతమంది పెళ్లి బంధాన్ని బ్రేకప్ చేసుకుంటారు. ఒకరితో ఒకరి పొసగక పోవడం, ఇంకొన్ని కారణాలతో బ్రేకప్ అనేది ఇప్పుడు సర్వసాధారణం అయ్యిపోయింది. తాజాగా బాలీవుడ్ ప్రేమికులుగా ఎక్సపోజ్ అయిన ఓ జంట ఇప్పుడు పెళ్లి కాకుండానే ఆ బంధానికి బ్రేకులు వేసింది. ఒకప్పటి హీరోయిన్ ఇప్పుడు భర్త కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తున్న శిల్పా శెట్టి సోదరి షమితా శెట్టి తన ప్రేమకి బ్రేకప్ చెప్పేసింది.
అక్క శిల్పా శెట్టి లా పాపులర్ అవ్వలేక.. సినిమాలు చేసినా సక్సెస్ అవ్వక కెరీర్ లో సతమతమవుతున్న షమితా శెట్టి గత ఏడాది సల్మాన్ హోస్ట్ గా వచ్చిన బిగ్ బాస్ లోను కనిపించింది. ఆ బిగ్ బాస్ లోనే ఆమె నటుడు రాగేష్ బాపత్ తో పరిచయం పెంచుకుంది. తర్వాత ఇద్దరూ ప్రేమలో ఉన్నట్లుగా కన్ ఫర్మ్ చేసారు. ఆ ప్రేమ కి ఏమైందో ఏమో.. ఇప్పుడు ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్టుగా ప్రకటించి షాకిచ్చారు. మా బంధంపై స్పష్టత ఇవ్వడం అనేది ఎంతో ముఖ్యమని, కొంతకాలంగా మేము ఇద్దరం కలిసి లేము, ఇప్పటివరకు మాపై చూపించిన ప్రేమాభిమానాలకు కృతఙ్ఞతలు తెలుపుతూ తమ బ్రేకప్ విషయాన్ని షమితా శెట్టి-రాగేష్ బాపత్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.