Advertisementt

అందుకే బాలీవుడ్ కి నష్టం

Thu 28th Jul 2022 09:35 AM
anurag kashyap,hindi films,box office,english  అందుకే బాలీవుడ్ కి నష్టం
Anurag Kashyap comments on Bollywood success అందుకే బాలీవుడ్ కి నష్టం
Advertisement
Ads by CJ

ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అని చెప్పుకునే స్థాయి ప్రస్తుతం లేదు. బాలీవుడ్ సినిమాల మీద సౌత్ బ్లాక్ బస్టర్ సినిమాలు దండెత్తడంతో బాలీవుడ్ స్టార్ హీరో లకి ఇప్పుడు టెంక్షన్ స్టార్ట్ అయ్యింది. తమ సినిమాలు సౌత్ సినిమాలపై పై చెయ్యి సాధించాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నా.. ఆ ప్రయత్నాలేమి కలిసి రావడం లేదు. దానితో ఇప్పుడు బాలీవుడ్ vs సౌత్ అన్న రేంజ్ లోకి పరిస్థితులు వెళ్లిపోయాయి. బాలీవుడ్ హీరోలు కొంతమంది సౌత్ మీద పలురకాల కామెంట్స్ చేస్తున్నారు. అయినా సౌత్ దర్శకులు అస్సలు తగ్గడం లేదు. అయితే తాజాగా విలక్షణ నటుడు, దర్శకుడు అనురాగ్ కశ్యప్ బాలీవుడ్ లో విజయాలు ఎందుకు తగ్గుతున్నాయో కారణాలు చెబుతున్నారు. 

అనురాగ్ కశ్యప్ డైరెక్షన్ లో తాప్సి కీలక పాత్రలో నటించిన దోబారా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో బాలీవుడ్ లో సక్సెస్ లు తగ్గడానికి ప్రధాన కారణం భాష రాకపోయినా కొందరు దర్శకులు సినిమాలు చెయ్యడమే అని, తాము చేస్తున్న లాంగ్వేజ్ తెలియకుండానే సినిమా చేస్తున్నారు. ఆ ప్రభావం సినిమా పై పడుతుంది. ఇంగ్లీష్ తప్ప హిందీ మాట్లాడం రాని వాళ్ళు సినిమాలు డైరెక్ట్ చెయ్యడం వలన కథలోని మూలలలోకి వెళ్లడం ఎలా సాధ్యమవుతుంది. అందుకే సినిమాలు హిట్ అవడం లేదు అంటూ అనురాగ్ కశ్యప్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Anurag Kashyap comments on Bollywood success:

Anurag Kashyap reveals why Hindi films are failing at the box office; People who speak English are making Hi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ