ఈమధ్యన సినిమా ఇండస్ట్రీలోని హీరోలపై సెన్సేషనల్ కామెంట్స్ చేయడమే కాకుండా.. తనని ఆ హీరోలు మోసం చేసారంటూ సంచలనంగా మాట్లాడుతున్న అమ్మా రాజశేఖర్ అల్లు అర్జున్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. హీరో నితిన్ తనని మోసం చేసాడు అని, గోపీచంద్, జెడి చక్రవర్తిలు తనని మోసం చేసారు అంటూ గగ్గోలు పెడుతున్న అమ్మా రాజశేఖర్.. తాజాగా అల్లు అర్జున్ డాన్స్ గురించి మట్లాడారు.
ఇండస్ట్రీలో ఎవరు బెస్ట్ డాన్సర్, ఎవరు డాన్స్ విషయంలో ఎక్కువగా కష్టపడతారని అడిగితే.. అందరూ మంచి డాన్సర్స్.. అందులో అల్లు అర్జున్ ఇంకా మంచి డాన్సర్ అని చెప్పారు. అంతేకాకుండా డాన్స్ విషయంలో అల్లు అర్జున్ ఎంతో కష్టపడతాడని, అలాగే కొంతమంది కాన్ఫిడెంట్ తో రిహర్సల్స్ చెయ్యకుండా డాన్స్ ఫ్లోర్ పైకి వచ్చేస్తారని కానీ, అల్లు అర్జున్ రిహార్సల్స్ చేసి మరీ పర్ఫెక్ట్ గా డాన్స్ స్టెప్స్ చేస్తాడని చెప్పారు. అలాగే అల్లు అర్జున్ బద్రీనాధ్ సినిమా టైం లో చేతికి ఫ్రాక్చర్ అయినా కూడా 5 డేస్ కొన్ని స్టెప్స్ ఎంతో కష్టపడి రిహార్సల్స్ చేశాడంటూ అమ్మా రాజశేఖర్ అల్లు అర్జున్ డాన్స్ పై కామెంట్స్ చేసారు.