Advertisementt

యంగ్ టైగర్ స్పీచ్ పై ఫాన్స్ లో ఉత్కంఠ

Thu 28th Jul 2022 01:39 PM
ntr,bimbisara,kalyan ram,ntr fans  యంగ్ టైగర్ స్పీచ్ పై ఫాన్స్ లో ఉత్కంఠ
Fans are excited about Young Tiger speech యంగ్ టైగర్ స్పీచ్ పై ఫాన్స్ లో ఉత్కంఠ
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎన్టీఆర్ ఫాన్స్ తెగ ఇదైపోతున్నారు. ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ ని చూసిన సందర్భాలు చాలా తక్కువ కావడంతో ఫాన్స్ లో ఎన్టీఆర్ ని చూసేవరకు ఆత్రుత ఆగేలా లేదు. నిన్న బుధవారం ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ బింబిసారా ట్రైలర్ ని ఎన్టీఆర్ డిజిటల్ గా లాంచ్ చేసారు. ఇక ఈ నెల 29 న బింబిసారా ఈవెంట్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా రాబోతున్నారు. ఆ ఈవెంట్ లో ఎన్టీఆర్ ఏం మాట్లాడతారు? NTR30 పై ఎలాంటి న్యూస్ ఇవ్వబోతున్నారు? పొలిటికల్ గా ఎలాంటి హింట్ ఇస్తారు? అని ఆయన ఫాన్స్ లో ఆత్రుత మొదలిపోతుంది.

ముఖ్యంగా కొరటాల తో ఎన్టీఆర్ చెయ్యబోయే మూవీ విషయంపై ఎన్టీఆర్ పక్కాగా మాట్లాడతారని, ఎప్పుడు సినిమా మొదలు పెట్టబోయేది కచ్చితంగా అప్ డేట్ ఇవ్వడం ఖాయమంటున్నారు ఫాన్స్. ఇప్పటికే NTR30 సెప్టెంబర్ రెండో వారం నుండి మొదలు కాబోతుంది అంటూ ప్రచారం జరుగుతున్న వేళ.. ఎన్టీఆర్ చెప్పబోయే ఆ ఆసక్తికర అప్ డేట్ కోసం ఫాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు.  

Fans are excited about Young Tiger speech:

Young Tiger NTR to grace Bimbisara event

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ