Advertisementt

ఇంతకీ బ్రేకప్ అయ్యిందా? లేదా?

Thu 28th Jul 2022 01:58 PM
jackie shroff,tiger shroff,disha patani,tiger shroff and disha patani break up rumour  ఇంతకీ బ్రేకప్ అయ్యిందా? లేదా?
Jackie Shroff on Tiger Shroff-Disha Patani breakup rumours ఇంతకీ బ్రేకప్ అయ్యిందా? లేదా?
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో ఈమధ్యన బ్రేకప్ న్యూస్ లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. నిన్నగాక మొన్న శిల్పా శెట్టి సోదరి షమితాశెట్టి బోయ్ ఫ్రెండ్ కి బై బై చెప్పేసింది. ఇక ఇప్పుడు గ్లామర్ హీరోయిన్ దిశా పటాని - హీరో టైగ‌ర్ ష్రాఫ్‌ మధ్యన బ్రేకప్ అయ్యింది అనే న్యూస్ బాలీవుడ్ మీడియాలో మొదలయ్యింది. బాగీ2 షూటింగ్ చేస్తున్నప్ప్పుడు నుండి వీరికి పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారినప్పటికీ.. వీరు తమ రిలేషన్ షిప్ ని ఇప్పటివరకు కన్ ఫర్మ్ చేసింది లేదు. చెట్టాపట్టాలేసుకుని మాల్దీవులకు, పార్టీలకి, వెకేషన్స్ ని చెక్కేసే ఈ జంట చాలారోజులు కలిసే ఉన్నారు. కానీ ఇప్పుడు వీరిద్దరూ కలిసి కనిపించడం లేదు, కామ్ గా ఎవరి పనుల్లో వారు బిజీగా వున్నారు.

వాళ్ళలా ఉండడంతో దిశా కి టైగ‌ర్ ష్రాఫ్‌ మధ్యన బ్రేకప్ కారణంగానే వారు కలిసి కనిపించడం లేదు అంటూ ప్రచారం మొదలయ్యింది. తాజాగా టైగ‌ర్ ష్రాఫ్‌ తండ్రి జాకీ ష్రాఫ్‌ ని ఈ బ్రేకప్ విషయాలపై మీడియా ప్రశ్నించగా.. ఆయన మాత్రం వారిద్దరూ మంచి స్నేహితులుగానే నాకు తెలుసు. వారెప్పటికీ మంచి స్నేహితులుగానే ఉంటారని.. మరీ వారి పర్సనల్ లైఫ్ లోకి దూరిపోవడం కరెక్ట్ కాదనేది తన అభిప్రాయమంటూ చెప్పడంతో.. అసలు దిశా పటాని, టైగ‌ర్ ష్రాఫ్‌ కి బ్రేకప్ అయ్యిందా? లేదా కలిసే ఉన్నారా? అనేది మాత్రం మీడియాకి క్లారిటీ రాలేదు.

Jackie Shroff on Tiger Shroff-Disha Patani breakup rumours:

Jackie Shroff Reacts to Tiger Shroff And Disha Patani break up rumour

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ