యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా ఓకె చేయించుకుని సెన్సేషన్ క్రియేట్ చేసాడు ఉప్పెన డైరెక్టర్ బుచ్చి బాబు. ఎన్టీఆర్ కొన్నేళ్లపాటు అందుబాటలోకి రాకపోయినా.. ఎన్టీఆర్ స్క్రిప్ట్ తోనే ప్రస్తుతం బుచ్చిబాబు ట్రావెల్ చేస్తున్నాడు. సుకుమార్ శిష్యుడిగా బుచ్చి బాబు ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కి బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా హిట్ తో ఎన్టీఆర్ ని మూవీకి కమిట్ చేయించేసాడు. అయితే రెండు రోజుల క్రితం సుకుమార్ తో బుచ్చి బాబు మాట్లాడుతున్న పిక్ సోషల్ మీడియాలో చూసిన జనాలు.. పుష్ప 2 షూటింగ్ మొదలు కాబోతుంది. సుకుమార్ బుచ్చి బాబు ని రప్పించుకున్నాడు. పుష్ప 2 స్క్రిప్ట్ లో గురు శిష్యులు తలమునకలై ఉన్నారంటూ సోషల్ మీడియాలో న్యూస్ లు ప్రచారంలోకి వచ్చాయి.
కొంతమంది ఎన్టీఆర్ తో చెయ్యబోయే సినిమా కోసం బుచ్చి బాబు సుకుమార్ ని మీట్ అయ్యాడని అన్నారు. అదే నిజం. తాజాగా బుచ్చిబాబు ట్వీట్ చేస్తూ.. నేను తర్వాత చేయబోయే నా సినిమా కథ గురించి చర్చిస్తున్న సందర్భంలోది. మా గురువుగారు సుకుమార్ సర్ నా కోసం, నా సినిమా కథ కోసం సాయం చేయడానికి వచ్చారు. సుకుమార్ సర్ సినిమా కథలో కూర్చుని చర్చించేంత స్థాయి నాకు లేదు, రాదు. ఆయన నుంచి నేర్చుకోవడమే తప్ప ఆయనకు ఇచ్చేంత లేదు అంటూ గమ్మత్తుగా ట్వీట్ చేసాడు. అంటే ఎన్టీఆర్ కథ ని చర్చించేందుకే బుచ్చిబాబు సుక్కుని కలిసాడన్నమాట.. అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ ఉత్సాహ పడుతున్నారు.