కళ్యాణ్ రామ్ నటించిన పాన్ ఇండియా మూవీ బింబిసారా ఆగష్టు 5 న రిలీజ్ కాబోతుంది. ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన బింబిసారా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చారు. అన్నా కళ్యాణ్ రామ్ కోసం కదిలిన పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్.. స్పీచ్ పై ఆయన ఫాన్స్ లో ఎంతో ఆత్రుత ఉంది. అయితే కళ్యాణ్ రామ్ తో పాటుగా స్టేజ్ ఎక్కిన ఎన్టీఆర్.. అందరికి నమస్కరించి సుమారు రెండున్నర సంవత్సరాల క్రితం కళ్యాణ్ అన్న ఫోన్ చేసి నాన్నా(తారక్) ఒక ఇంట్రెస్టింగ్ కథని విన్నాను. ఒక్కసారి నువ్వు వింటే బావుంటుంది అన్నారు. అంతకుముందు వశిష్ట తెలుసు నాకు. వసిష్ఠ ని వేణు అనే పిలుస్తాను. ఒక రోజు బింబిసారా కథ చెప్పడం జరిగింది. ఆ రోజు మొదలైన భయం.. ఎక్స్ పీరియన్స్ లేదు, ఇంత పెద్ద చిత్రాన్ని హ్యాండిల్ చేయగలడా.. కొత్త దర్శకుడు అనుకున్నాను. కానీ నేను అదృష్టవంతుడిని బింబిసారా సినిమా అందరికన్నా ముందే చూసాను.
ఎంత కసితో అయితే తాను ఆరోజు బింబిసారా కథని చెప్పాడో.. అంతకంటే గొప్పగా ఈ చిత్రాన్ని మలిచాడు. అది అంత ఈజీ కాదు. ఈ మూవీని చూసినప్పుడు నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. ఆ మూవీ ని చూసిన ప్రతి ఒక్కరూ అంత ఎగ్జైట్ మెంట్ కి గురవుతారు.. అంటూ ఎన్టీఆర్ వసిష్ఠ గురించి మాట్లాడారు.
మీకు నచ్చేవరకు చిత్రాలు చేస్తూనే ఉంటాము. నచ్చకపోయినా చేస్తూనే ఉంటాము. నచ్చేవరకు చేస్తూనే ఉంటాము. ఇప్పుడు బింబిసారా చూసాక నందమూరి కళ్యాణ్ రామ్ గారు ఇంకా పైకి కలర్ ఎగరేస్తారు. ఆయన చాలా కష్టపడతారు. కళ్యాణ్ అన్న కెరీర్ బింబిసారా ముందు, బింబిసారా తర్వాత అని మాట్లాడుకుంటారు. ఇది పక్కా అంటూ ఎన్టీఆర్ ఎనేర్జిటిక్ గా ఇచ్చిన స్పీచ్ కి ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. బింబిసారా టీజర్ సూపర్ అని చెప్పిన ఎన్టీఆర్ అందరిని జాగ్రత్తగా ఇంటికి చేరమని మరీ స్పీచ్ ఎండ్ చేసారు.