మెగాస్టార్ చిరు వరస లైన్ అప్ లో Mega 154 షూటింగ్ చాలా స్పీడు గా కానిచ్చేస్తున్నారు బాబీ. సంక్రాంతి టార్గెట్ గా తెరకెక్కుతున్న Mega 154 మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి వాల్తేర్ వీరయ్య టైటిల్ ని రిజిస్టర్ చేయించారు. కానీ గ్రాండ్ గా టైటిల్ ని రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేసుకుని టైటిల్ ని బయటపెట్టకపోయినా.. బాబీ తో పాటుగా చిరు కూడా అదే టైటిల్ ని కన్ ఫమ్ చేసారు. ఇక ఈ సినిమాలో చిరు కి జోడిగా గ్లామర్ డాల్ శృతి హాసన్ నటిస్తుంది.
అయితే ఈ సినిమా నేపథ్యం సవతి సోదరుల మధ్యన జరిగే ఫైట్ గా ప్రచారం జరుగుతుంది. చిరు కి సవతి సోదరుడిగా హీరో తేజ కనిపించబోతున్నారు అంటున్నారు. ఇప్పుడు ఈ చిత్రంలో చిరు దొంగకా కనిపిస్తుండగా, రవి తేజ పోలీస్ గా కనిపిస్తారని లేటెస్ట్ గా తెలుస్తున్న న్యూస్. చిరు ని పట్టుకోవడానికి రవితేజ నానా తంటాలు పడతారని, వీరిద్దరూ సవతి సోదరులు కావడంతో వారి మధ్యన ఫైట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని తెలుస్తుంది.