కరోనా థర్డ్ వేవ్ కి ముందు, థర్డ్ వేవ్ కి తర్వాత పెద్ద సినిమాలు థియేటర్స్ ని దడదడలాడించేసాయి. ప్రేక్షకుల్లోనూ థియేటర్స్ కి వెళ్లి సినిమాలు చూసే ఊపొచ్చింది. అఖండ, పుష్ప, శ్యామ్ సింగ రాయ్, భీమ్లా నాయక్, ట్రిపుల్ ఆర్, కెజిఎఫ్, సర్కారు వారి పాట, విక్రమ్, మేజర్ ఇలా పెద్ద సినిమాలు ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. జూన్ వరకు ఒక వారం హిట్ అయితే మరో వారం సినిమాలు ప్లాప్ అయినా ఆడియన్స్ బోర్ ఫీలవ్వలేదు. కానీ జులై 1st నుండి ప్రతివారం అంటే జులై నెల ముగిసేవరకు వరసగా వారం వారం సినిమాలు రిలీజ్ అయినా ఏ ఒక్క సినిమా హిట్ అవ్వలేదు, ఆడియన్స్ ని ఇంప్రెస్స్ చెయ్యలేదు.
జులై 1న విడుదలైన గోపీచంద్ పక్కా కమర్షియల్ కి డిసాస్టర్ టాక్ పడింది, ఆ తర్వాత వారం లావణ్య త్రిపాఠి హ్యాపీ బర్త్ డే కూడా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన రామ్ వారియర్ జులై మూడో వారంలో సో సో టాక్ తెచ్చుకోగా.. ఆ సినిమా రామ్ కి నిర్మాతలకి భారీ నష్టాలని మిగిల్చింది. తరవాత నాగ చైతన్య - విక్రమ్ కుమార్ ల థాంక్యూ మూవీ కూడా అంచనాలతోనే థియేటర్స్ దగ్గరకి రాగా.. నాగ చైతన్య కూడా ఆడియన్స్ ని మెప్పించడంలో తడబడ్డాడు. ఫలితంగా నాగ చైతన్య కు థాంక్యూ ప్లాప్ ని మిగిల్చింది. ఇక జులై చివరి వారం బరిలోకి వచ్చిన మాస్ మహారాజ్ రవితేజ కూడా రామారావు ఆన్ డ్యూటీ తో డ్యూటీ ఎక్కాడు అనుకుంటే.. రామారావు ని ఆడియన్స్ ఆదరించలేదు. ఇవే కాకుండా, రామ్ గోపాల్ వర్మ లడ్కి, షికారు, డబ్బింగ్ సినిమాలు, అనసూయ దర్జా, వెబ్ సీరీస్ లు జులై లో విడుదలై.. ఆడియన్స్ కి నిరాశనే మిగిల్చాయి.
సాయి పల్లవి గార్గి కి పాజిటివ్ టాక్ కాదు హిట్ టాక్ వచ్చినా ఆ సినిమా ఎందుకో థియేటర్స్ లో అంతగా ఆడియన్స్ ని ప్రభావితం చెయ్యలేకపోయింది. ఫలితంగా జులై మంత్ టాలీవుడ్ కి డిసాస్టర్ మంత్ గా నిలిచింది.