జులై నెల మొత్తం వారం వారం విడుదలైన సినిమాలు ఏవి ఆడియన్స్ ని థ్రిల్ చెయ్యలేదు. జులై 1 నుండి 29 వరకు రిలీజ్ అయిన పక్కా కమర్షియల్, ద వారియర్, హ్యాపీ బర్త్ డే, థాంక్యూ, రామారావు ఆన్ డ్యూటీ ఇలా ఏ ఒక్క సినిమా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయలేకపోయాయి. హీరోలకి ప్లాప్స్, మేకర్స్ కి భారీ నష్టాలూ మిగిల్చాయి. జులై నెల మొత్తం ప్రేక్షకులకి బోర్ కొట్టించేసింది. కానీ ఈ ఆగష్టు మాత్రం ప్రేక్షకుల్లో ఆశలు రేపుతోంది. ఇంట్రెస్టింగ్ సినిమాలు బాక్సాఫీస్ వార్ కి రెడీ అవుతున్నాయి. అందులో మొదటి వారం కళ్యాణ్ రామ్ బింబిసారా - దుల్కర్ సల్మాన్ సీత రామం పోటీ పడుతున్నాయి.
రెండు సినిమాలు ప్రమోషన్స్ పరంగా క్రేజిగానే కనిపిస్తున్నాయి. తర్వాత అంటే ఆగష్టు 12 రెండో వారం నితిన్ మాచర్ల నియోజక వర్గం, నిఖిల్ కార్తికేయ 2 తలపడబోతున్నాయి. రెండు సినిమాలు రెండురకాల జోనర్స్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. అలాగే ఆగష్టు 11 న బాలీవుడ్ నుండి లాల్ సింగ్ చద్దా రిలీజ్ అవుతుంది. ఇక మూడో వారం లో చిన్న సినిమాలు క్యూ కడుతున్నాయి. ఆగష్టు నాలుగో వారానికి ముందే అంటే ఆగష్టు 25 నే పాన్ ఇండియా మూవీ లైగర్ రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ కోసం ఇండియా వైడ్ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. సో జులై బోర్ కొట్టించగా.. ఆగష్టు మాత్రం ఆశలు రేపుతుంది.