సీనియర్ ఎన్టీఆర్ నాలుగో కూతురు ఉమామహేశ్వరి హఠాన్మరణం అని తెలియగానే నందమూరి అభిమానులు షాకవుతున్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఉమామహేశ్వరి(52) ఈ రోజు సోమవారం ఉదయం హఠాత్తుగా చనిపోయిన విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబెర్స్ హుటాహుటిన ఉమామహేశ్వరి ఇంటికి చేరుకుంటున్నారు.
అసలు ఉమా మహేశ్వరీ ఇంత హఠాత్తుగా కన్ను మూయడానికి గల కారణాలు తెలియరావాల్సి ఉండగా.. ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకుంది అని, ఆమె ఫాన్స్ కి చున్నీ తో ఉరి వేసుకుని సూయిసైడ్ చేసుకుంది అంటూ మీడియాలో వార్తలు రావడంతో నందమూరి అభిమానులు మరింతగా షాకవుతున్నారు. మానసిక ఒత్తిడి కారణంగా, అనారోగ్య సమస్యల కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఆమె మరణంతో నందమూరి కుటుంబ సభ్యులు మాత్రం శోక సముద్రంలో మునిగిపోయారు.
చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, కళ్యాణ్ రామ్, భువనేశ్వరి, పురందరేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరావు ఇలా అందరూ ఉమామహేశ్వరి ఇంటికి చేరుకుంటున్నారు. ఉమామహేశ్వరి మృతదేహాన్ని పోలీస్ లు పోస్ట్ మార్టం కి తరలించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.