ఎంత పాన్ ఇండియా మూవీ అయినా.. బాలీవుడ్ లోనే అంటే ముంబై లోనే ఉండిపోయి అక్కడే ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ చెయ్యడమే కాదు.. ఇప్పుడు ప్రమోషన్స్ విషయంలోనూ హిందీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్నారు. మాములుగా సౌత్ హీరోలు, సౌత్ డైరెక్టర్స్ తీసే సినిమాలు ఇక్కడే తెరకెక్కించి ముంబైలో ఎక్కువగా ప్రమోషన్స్ చేస్తుంటారు కానీ.. ముంబై లోనే ఉండిపోయి.. అక్కడే ప్రమోషన్స్ చేస్తూ సౌత్ కి అప్పుడప్పుడు రావడం మాత్రం లైగర్ టీం ఒక్కటే చేస్తుంది. విజయ్ దేవరకొండ - పూరి - ఛార్మి ముగ్గురు ముంబైలో స్టే చేస్తూ అక్కడి హిందీ సినిమాలు ఎలా ప్రమోట్ చేస్తారో అచ్చం అలానే లైగర్ ప్రమోషన్స్ పెట్టారు.
విజయ్ దేవరకొండ హీరోయిన్ అనన్య పాండే లు ముంబైలో ఏ మాల్ లో చూసిన వాళ్లే, ఎక్కడబడితే అక్కడ వారే కనబడుతున్నారు. బాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్ ఎలా అయితే టాక్ షోస్, మాల్స్ విసిట్ చేస్తూ ప్రమోషన్స్ చేస్తారో.. అచ్చం అలానే విజయ్ దేవరకొండ లైగర్ ని ప్రమోట్ చేస్తున్నాడు. ముంబై లో విజయ్ - అనన్య లు ఓ మాల్ కి వెళ్ళగానే అక్కడ జనాలు కిక్కిరిసిపోయారు. విజయ్ కి నార్త్ లో అంత క్రేజ్ ఉందా అనేంత జనం అక్కడ కనబడ్డారు. మరి ముంబై ప్రమోషన్స్ పూర్తి చేసి తర్వాతే సౌత్ ప్రమోషన్స్ మొదలు పెట్టేలా కనబడుతుంది వ్యవహారం.