Advertisementt

ఆఫర్స్ లేకపోయినా 'ఆ' పని చెయ్యను

Tue 02nd Aug 2022 02:35 PM
sai pallavi,virataparvam movie,gargi movie,love story,shyam singah roy  ఆఫర్స్ లేకపోయినా 'ఆ' పని చెయ్యను
Even if there are no offers, I will not do it ఆఫర్స్ లేకపోయినా 'ఆ' పని చెయ్యను
Advertisement
Ads by CJ

టాలెంటెడ్ బ్యూటీ సాయి పల్లవికి వరసగా షాక్ లు తగులుతున్నాయి. సాయి పల్లవి నటించిన లవ్ స్టోరీ, శ్యామ్ సింగ రాయ్ ఆమెకి మంచి హిట్స్ ఇవ్వగా, లేటెస్ట్ గా వచ్చిన విరాట పర్వం, గార్గి సినిమాలు ఆమెకి షాకిచ్చాయి. ఆ సినిమాలలో సాయి పల్లవి పెరఫార్మెన్స్ కి 100 కి 200 మార్కులొచ్చాయి. సినిమా లు హిట్ అన్నప్పటికీ.. కమర్షియల్ గా లేకపోవడంతో కలక్షన్స్ రాలేదు. కారణం ఆ కథల నేపథ్యం అలాంటిది కాబట్టి. అయితే సాయి పల్లవి ఇలా మెస్సేజ్ ఓరియెంటెడ్ మూవీస్ ని ఎంచుకోవడం వలన ఆమెకి సక్సెస్ రావడం లేదనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. 

దానితో సాయి పల్లవికి సలహాలు ఎక్కువయ్యాయని, ఆమెతో సినిమాలు చెయ్యాలని ఇంట్రెస్ట్ చూపించే నిర్మాతలు సాయి పల్లవి తో మీరు కొద్దిగా చేంజ్ అవ్వాలి, గ్లామర్ షో చెయ్యడానికి రెడీ అవ్వాలి, కమర్షియల్ మూవీస్ కి కూడా ఓకె చెప్పాలని చెప్పగా.. దానికి సాయి పల్లవి, సినిమా ఆఫర్స్ రాకపోతే ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు,  క్లినిక్ అయినా పెట్టుకుంటా, లేదంటే జాబ్ చేస్తాను కానీ, నా స్థాయిని తగ్గించుకొని ఇష్టంలేని సినిమాల్లో నటించలేనని మొహం మీదే చెప్పిందట. ప్రస్తుతం సాయి పల్లవి తమిళంలో కమల్ హాసన్ తో ఓ మూవీ చేస్తుంది. అయితే సాయి పల్లవి మొదటి నుండి డబ్బు కోసం కమర్షియల్ యాడ్స్ లో నటించడానికి వ్యతిరేఖం. 

Even if there are no offers, I will not do it:

Sai Pallavi movie updates

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ