Advertisementt

అలాంటి రెస్పెక్ట్ నాకు వద్దు

Wed 03rd Aug 2022 09:49 AM
bindu madhavi,bigg boss,bigg boss ott,netizen comment  అలాంటి రెస్పెక్ట్ నాకు వద్దు
Netizen comments on Bigg Boss Bindu Madhavi అలాంటి రెస్పెక్ట్ నాకు వద్దు
Advertisement
Ads by CJ

బిందు మాధవి తెలుగు అమ్మాయిగా తెలుగు సినిమాల్లో నటించినా సత్తా చాటలేకపోయిన ఆమె తమిళ, కన్నడ భాషల్లోనూ తన అదృష్టాన్ని పరిక్షించుకుంది. గ్లామర్ చూపించినా సక్సెస్ దొరక్క బిగ్ బాస్ ఆఫర్ రాగానే బిగ్ బాస్ ఓటిటి లోకి అడుగుపెట్టిన ఆమె హౌస్ లో చూపించిన యాటిట్యూడ్, అఖిల్ సార్థక్, నటరాజ్ మాస్టర్ తో ఫైటింగ్, యాంకర్ శివ తో ఫ్రెండ్ షిప్ అన్ని ఆమెని విజయ తీరానికి చేర్చాయి. బిగ్ బాస్ ఫస్ట్ ఓటిటి టైటిల్ లేడీ కంటెస్టెంట్ అయిన బిందు మాధవికి చేతుల్లోకి వెళ్ళింది. బిగ్ బాస్ హౌస్ లో చాలా ట్రెడిషనల్ గా తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. 

అయితే హౌస్ నుండి బయటికి వచ్చాక కాస్త సైలెంట్ గానే ఉన్న బిందు మాధవి కి ఆఫర్స్ రావాలంటే గ్లామర్ షో చెయ్యాలి అని తెలిసిన అమ్మాయి కాబట్టి అందాల ఆరబోతకు దిగుతూ ఓ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వదిలింది. ఆ పిక్స్ లో బిందు మాధవి అందాలు బాగా హైలెట్ అయ్యాయి. కొంతమంది బిందు మాధవి గ్లామర్ షూట్ కి ఫిదా అయితే కొంతమంది.. బిగ్ బాస్ హౌస్ లో చాలామంది ఒళ్ళు కనిపించేలా డ్రెస్ లు వేసుకుంటే బిందు మాధవి మాత్రం సాంప్రదాయకమైన దుస్తులతో గౌరవాన్ని పెంచింది. దీంతో బిందు మాధవి అంటే రెస్పెక్ట్ పెరిగింది. కానీ ఇప్పుడు ఈ ఫోటో షూట్ తో ఆ రెస్పెక్ట్ ఇప్పుడు పోయింది. అందరి దగ్గర మార్కులు కొట్టాలనే ఉద్దేశంతోనే తను హౌజ్‌లో అలా ఉంది అంటూ నెటిజెన్ కామెంట్ చెయ్యగా.. 

దానికి బిందు మాధవి స్ట్రాంగ్ గానే రిప్లై ఇచ్చింది. మనం ధరించే దుస్తులను బట్టే వ్యక్తికి గౌరవం ఇస్తారంటే.. అలాంటి గౌరవం నాకు వద్దు.. అంటూ స్ట్రాంగ్ గా కౌంటర్ వేసింది. 

Netizen comments on Bigg Boss Bindu Madhavi:

Bindu Madhavi gave a strong counter to a netizen comment

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ