శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాకన్నా ముందే ఒకే ఒక జీవితం సినిమా రిలీజ్ చేద్దామనుకుని, ఎందుకో సడన్ గా ఆడవాళ్లు మీకు జోహార్లని రేస్ లోకి తీసుకువచ్చాడు. కానీ ఆ సినిమా శర్వానంద్ ని బాగా నిరాశ పరిచింది. శ్రీకారం హిట్ అయినా ఆ సినిమాకి కలెక్షన్స్ రాలేదు. తర్వాత మహాసముద్రం డిసాస్టర్ అవడంతో.. శర్వా ఆడవాళ్లకు మీకు జోహార్లపై ఆశలు పెట్టుకోగా అది కూడా ప్లాప్ అవడంతో సైలెంట్ అయ్యాడు. ఒకే ఒక జీవితం ఎప్పుడో విడుదల కావాల్సిన మూవీ.. ఇప్పటివరకు ఆ సినిమా రిలీజ్ డేట్ ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నాడు శర్వా.
అటు నాగ శౌర్య కూడా వరుడు కావలెను తో డీసెంట్ హిట్ కొట్టినా.. ఆ సినిమాకి కలెక్షన్స్ లేకపోవడంతో ప్లాప్ లిస్ట్ లోకి చేరింది. తర్వాత భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన లక్ష్య కూడా నాగ శౌర్య ని కాపాడలేకపోయింది. తర్వాత నాగ శౌర్య కృష్ణ వ్రింద విహారి మూవీ ని మే లోనే రిలీజ్ చేస్తామంటూ పలు రిలీజ్ డేట్స్ ఇవ్వడమే కాకుండా సినిమాని గట్టిగా ప్రమోట్ చేసే ప్లాన్ చేసారు. కానీ రిలీజ్ డేట్స్ పదే పదే మార్చుకుంటూ కృష్ణ వ్రింద విహారి రిలీజ్ విషయంలో మేకర్స్ కూడా కామ్ అయ్యారు.
సినిమాలు షూటింగ్స్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అవ్వగానే ప్రమోషన్స్ మొదలు పెట్టి.. రిలీజ్ చెయ్యకుండా ఆగిపోయాయి. మరి ఈ ఇద్దరు యంగ్ హీరోలు ఎప్పుడు సినిమాలు విడుదల చేస్తారో చూడాలి.