జబర్దస్త్ లో గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ ఇద్దరూ ఒకేసారి మానేశారు. సుధీర్ పారితోషకం ఎక్కువ కారణంగా పక్క ఛానల్ కి వెళ్లిపోగా.. శ్రీను మాత్రం సినిమాల వలనే మూడు నెలలు గ్యాప్ ఇచ్చినట్టుగా చెప్పారు. మధ్యలో రామ్ ప్రసాద్ జబర్దస్త్ లో ఒంటరి వాడు అవడంతో కెవ్వు కార్తీక్ టీం ఈ ముగ్గురి ఫ్రెండ్స్ పై స్కిట్ చెయ్యగా.. రామ్ ప్రసాద్ బాగా ఎమోషనల్ అవ్వగా.. జెడ్జ్ ఇంద్రజ కన్నీళ్లు పెట్టుకున్న ఎపిసోడ్ వైరల్ గా మారింది. వారి ముగ్గురి ఫ్రెండ్ షిప్ కి దిష్టి తగిలింది అంటూ ఇంద్రజ ఏడ్చేసింది.. ఆ ఎపిసోడ్ లో ప్రతి ఒక్క కమెడియన్ కన్నీళ్ళు పెట్టుకున్నారు. తర్వాత కిరాక్ ఆర్పీ మల్లెమాల పై చేసిన కామెంట్స్ తర్వాత గెటప్ శ్రీను మళ్ళీ జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇచ్చాడు. రామ్ ప్రసాద్ ని బిగ్ సర్ ప్రైజ్ చేస్తూ శ్రీను స్కిట్ లోకి ఎంట్రీ ఇవ్వగా.. అందరూ సర్ ప్రైజ్ అయ్యారు.
తర్వాత శ్రీను తో రామ్ ప్రసాద్ స్కిట్ చేసాడు. స్కిట్ అయ్యిపోయాక రష్మీ వచ్చి శ్రీను మళ్ళీ వెనక్కి వచ్చేసినందుకు చాలా థాంక్స్.. ఆ రోజు ముగ్గురు ఫ్రెండ్స్ మీద స్కిట్ చేసిన రోజు శ్రీను నాకు ఫోన్ చేసి చాలా ఏడ్చాడు.. అప్పుడు నేను ఎందుకు శ్రీను ఇకపై నీవు జబర్దస్త్ కి రావా అని అడిగితే.. లేదు నేను మళ్ళీ వస్తాను, నేను ఎప్పటికి ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను అని చెప్పాడు అంటూ ఎమోషనల్ అవ్వగా.. శ్రీను కూడా అవును.. ఆ రోజు రామ్ ప్రసాద్ కి ఫోన్ చేస్తే ఎత్తలేదు.. అందుకే తర్వాత ఇంపార్టెంట్ అయిన నీకు చేశాను అంటూ ఇకపై నేను ఆటో రామ్ ప్రసాద్ స్కిట్ లో కామెడీ చేస్తాను. అంతేకాని నేను టీం లీడర్ అవ్వను, రామ్ ప్రసాద్ సోలో టీం లీడర్ గానే చేస్తాడు అంటూ చెప్పాడు. జబర్దస్త్ కి శ్రీను మళ్ళీ రావడంపై ఆయన ఫాన్స్ మాత్రం బాగా హ్యాపీ గా ఉన్నారు.