ప్రభాస్ బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అవ్వగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ తో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ప్రభాస్ బాహుబలి తర్వాత వరస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో ఫాన్స్ కి ట్రీట్స్ ఇస్తున్నారు. ఎన్టీఆర్ కూడా ట్రిపుల్ ఆర్ తర్వాత పాన్ ఇండియా మూవీస్ నే లైన్ లో పెట్టారు. మరి ఇద్దరికి పాన్ ఇండియా లో ఎంత క్రేజ్ ఉందొ బేరీజు వెయ్యడం కష్టం కానీ.. వీరిద్దరి క్రేజ్ రేపు శుక్రవారం విడుదల కాబోయే సినిమాలకు ఎంత పనికొస్తుందో చూడాలి. అంటే ఎన్టీఆర్ తన పాన్ ఇండియా పవర్ ని కళ్యాణ్ రామ్ బింబిసారా కి చూపించారు. అన్న కళ్యాణ్ రామ్ బింబిసారా ప్రమోషన్స్ కి ఎన్టీఆర్ వచ్చారు.
ఇక మరో మూవీ సీత రామం. హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ నటించిన సీత రామం ప్రమోషన్స్ కోసం ప్రభాస్ దిగారు. సీత రామం నిర్మాత అశ్విని దత్ కోసం ప్రభాస్ సీత రామం ప్రమోషన్స్ లో మెరిశారు. దుల్కర్ అండ్ మృణాళిని, రశ్మికలు సినిమాని ప్రమోట్ చేస్తూ హడావిడి చేస్తున్నారు. దుల్కర్ అయితే టాలీవుడ్ బుల్లితెర షోస్ ని వదలడం లేదు. మరి ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్ క్రేజ్ వాడేశారు.
మరి బింబిసారా కి ఎన్టీఆర్, సీత రామం కి ప్రభాస్ చేసిన ప్రమోషన్స్ ఏ సినిమాని విజయతీరానికి చేరుస్తాయో చూడాలి. ఆగష్టు 5 న బింబిసారా vs సీత రామం.. ఇప్పుడు ఎన్టీఆర్ vs ప్రభాస్ క్రేజ్ అన్నట్టుగా ఉంది ఫాన్స్ మధ్యన వ్యవహారం.