Advertisementt

జబర్దస్త్ కొత్త యాంకర్: ఆడియన్స్ డిస్పాయింట్

Thu 04th Aug 2022 09:42 PM
rashmi,anasuya,jabardasth,extra jabardasth  జబర్దస్త్ కొత్త యాంకర్: ఆడియన్స్ డిస్పాయింట్
Rashmi replaces Anasuya జబర్దస్త్ కొత్త యాంకర్: ఆడియన్స్ డిస్పాయింట్
Advertisement
Ads by CJ

ఈటీవీలో గురువారం ప్రసారం అవుతున్న జబర్దస్త్ నుండి అనసూయ వెళ్ళిపోయింది. అనసూయ అందాలు, అనసూయ డాన్స్ ని బుల్లితెర ప్రేక్షకులు అన్నీ మిస్ అవుతారు. మరి అనసూయ కి తగిన యాంకర్ ని దింపడానికి జబర్దస్త్ మల్లెమాల టీం గట్టిగానే ప్లాన్ చేసింది. గత వారం రోజులుగా ఆ కొత్త యాంకర్ ఎవరో చెప్పకుండా బుల్లితెర ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని కలిగించింది. ఈ గురువారం అనసూయ ప్లేస్ లోకి రాబోయే కొత్త యాంకర్ పై సర్వత్రా ఆసక్తిని కలుగజేసి టీఆర్పీ పెంచే ప్లాన్ చేసింది.

అనుకున్నట్టుగానే మల్లెమాల చేసిన ప్లాన్ వర్కౌట్ అయినట్లుగా కనిపించింది. పల్లకిలో తీసుకొచ్చి, కమెడియన్స్ ద్వారా ఆసక్తిని కలిగించారు. అనసూయ ప్లేస్ ని రీప్లేస్ చేసిన ఆ యాంకర్ ఎవరా అని ఆత్రంగా ముసుగు తీసినవారికి షాకిచ్చారు మల్లెమాల టీం. ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్ రష్మిని కొత్త యాంకర్ కింద బిల్డప్ ఇచ్చి మరీ స్టేజ్ పైకి తీసుకువచ్చారు. అదేమిటి కొత్త యాంకర్ అంటే మీరు వచ్చారని అడిగితే.. నేను ఆడా.. ఉంటా.. ఈడా ఉంటా అంటూ రష్మీ స్టయిల్ లో డైలాగ్ చెప్పినా.. బుల్లితెర ప్రేక్షకులు మాత్రం బాగా డిస్పాయింట్ అయ్యారు. శుక్రవారం రష్మిని, ఇప్పుడు గురువారం కూడా రష్మినేనా అంటూ పెదవి విరుస్తుంటే.. బిల్డప్ ఇచ్చి బోల్తా కొట్టించారుగా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Rashmi replaces Anasuya:

Rashmi replaces Anasuya in Jabardasth 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ