Advertisementt

రోజుకి లక్ష అంటున్న నటి

Fri 05th Aug 2022 10:18 PM
actress pavitra lokesh,remuneration,naresh,ramya raghupathi,pavitra lokesh  రోజుకి లక్ష అంటున్న నటి
Pavitra Lokesh increased remuneration రోజుకి లక్ష అంటున్న నటి
Advertisement
Ads by CJ

సీనియర్ నరేష్, నటి పవిత్ర లోకేష్ లు గత కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్ అయిన వ్యక్తులు. నరేష్.. పవిత్ర లోకేష్ తో కలిసి ఉంటున్నారని, నాలుగో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ నరేష్ మూడో భార్య రమ్య చేసిన ఆరోపణల కారణంగా హాట్ టాపిక్ అవడం కాదు.. హోటల్ రూమ్ లో కలిసి ఉండగా.. మీడియా కి దొరకడం, పవిత్ర లోకేష్ భర్త పవిత్రపై ఆరోపణలు చెయ్యడం, ఇలా వారి మధ్యన చాలా హై డ్రామా నడుస్తున్న టైం లో రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో నరేష్ అండ్ పవిత్రలు అన్న చెల్లెళ్లుగా నటించడం ఆడియన్స్ విజిల్స్ వేసి నవ్వుకునేలా చేసింది.

అదలా ఉంటే పవిత్ర లోకేష్ కి ఇప్పుడు క్రేజ్ పెరిగింది అని ఆమె అనుకుంటుందో.. లేదంటే ఆమె కాంట్రవర్సీలు సినిమాలకి హెల్ప్ అవుతుంది అని నిర్మాతలు ఆలోచిస్తున్నారో తెలియదు కానీ.. పవిత్ర లోకేష్ మాత్రం పారితోషకం పెంచేసి నిర్మాతలకి చుక్కలు చూపిస్తుందట. ఇది వ‌ర‌కు ఆమె రోజుకి అర‌వై వేల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్‌ను ఛార్జ్ చేసేది అని.. కానీ ఇప్పుడు దాన్ని ల‌క్ష రూపాయ‌లు పెంచేసింది అనే టాక్‌ వినిపిస్తుంది. నరేష్ తో పవిత్ర వ్యవహారం తెరపైకి వచ్చాక ఆమెని స్టార్ హీరోల సినిమాల నుండి తప్పించారని అన్నారు. ఇక ఇప్పుడు ఆమె పారితోషకం పెంచింది అంటున్నారు. ఏది నిజమో అనేది తెలియాల్సి ఉంది.

Pavitra Lokesh increased remuneration:

Actress Pavitra Lokesh Hikes Her Remuneration

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ