నిన్న శుక్రవారం బాక్సాఫీసు కళకళలాడింది. గత నెల రోజులుగా నిస్సారంగా ఉన్న థియేటర్స్ నిన్న ప్రేక్షకుల కళకళతో బాక్సాఫీసు గలగలలు వినిపించాయి. కళ్యాణ్ రామ్ బింబిసారా, దుల్కర్ సల్మాన్ సీతారామం సినిమాలు రెండిటికి పాజిటివ్ టాక్ రావడంతో అటు మేకర్స్ ఎంత హ్యాపీ గా ఉన్నారో, ఇండస్ట్రీలో హిట్ శబ్దం వినిపించేసరికి ప్రముఖులు ఉత్సాహపడ్డారు. దానితో ఇండస్ట్రీకి హిట్ అందించిన బింబిసారా టీం ని, దుల్కర్ సల్మాన్ సీతారామం సినిమాలను అప్రిశేట్ చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.
ఉదయం చిరు రెండు సినిమాల యూనిట్స్ కి శుభాకాంక్షలు తెలపగా.. విజయ్ దేవరకొండ బింబిసారా, సీతారామం సినిమాల హిట్ పై ట్వీట్ చెయ్యడం వైరల్ అయ్యింది. ఒకే రోజు విడుదలైన రెండు సినిమాలు సక్సెస్ అయ్యాయని తెలిసి చాలా సంతోషం అనిపించింది. రెండు సినిమాలపై చాలామంది పాజిటివ్ గా స్పందిస్తున్నారు. అద్భుతమైన స్పందన ఒకే రోజు 2 సినిమాలు హిట్‌గా మారడం చాలా సంతోషంగా ఉంది. ఎంత మంచి రోజు ఇది, వైజయంతి ఫిల్మ్స్, దుల్కర్, మృణాల్, రష్మిక, సుమంత్ అన్నలకు అభినందనలు, హను రాఘవపూడి, సీతారామం బృందానికి అభినందనలు తెలిపిన విజయ్ దేవరకొండ.. నందమూరి కళ్యాణ్ గారు, హరి గారు, వశిష్ఠ గారు, ఎంఎం కీరవాణి గారు మరియు టీమ్ బింబిసారాకి అభినందనలు, మీ సినిమాకు అద్భుతమైన స్పందన వచ్చిందని విజయ్ దేవరకొండ ట్వీట్ చేసాడు.