హైదరాబాద్ లోని ప్రముఖ థియేటర్ PVR RK సినీప్లెక్స్ బంజారాహిల్స్ లో ఆదివారం ప్రేక్షకులు అందోళనకు దిగారు. గత శుక్రవారం విడుదలైన సినిమాలు సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోవడంతో ఆడియన్స్ థియేటర్స్ కి క్యూ కట్టారు. కొన్ని నెలలుగా థియేటర్స్ మొహం చూడని వారు కూడా ఇంట్రెస్టింగ్ గా థియేటర్స్ కి కదిలేలా చేసాయి బింబిసార, సీతారామం మూవీస్. ఈ రెండు సినిమాలు చూడాలనే కోరికతో ప్రేక్షకులు థియేటర్స్ వైపు కదిలారు. దానితో బుక్ మై షో లో టికెట్స్ తెగుతున్నాయి. అయితే ఈ ఆదివారం బంజారాహిల్స్ PVR RK సినీప్లెక్స్ థియేటర్ లో మధ్యాన్నం 1.15 షో కి సీతా రామం మూవీ చూసేందుకు ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేసుకుని వచ్చిన ప్రేక్షకులకి థియేటర్ యాజమాన్యం షాకిచ్చింది.
1.15 నిమిషాలకి మొదలు కావాల్సిన సీతారామం షో క్యాన్సిల్ అయ్యింది. ఇదిగో షో పడుతుంది, అదిగో షో పడుతుంది అని ఎదురు చూసిన ఆడియన్స్ కి నిరాశే మిగిలింది. టెక్నీకల్ ప్రోబ్లెంస్ వలన షో క్యాన్సిల్ చేస్తున్నట్టుగా థియేటర్ యాజమాన్యం ప్రకటించడంతో ప్రేక్షకులు అందోళనకు దిగి రచ్చ చేసారు. ఆన్ లైన్ లో టికెట్లు కొనుక్కుని సినిమా చూడాలని వస్తే షో క్యాన్సిల్ చెయ్యడం ఏమిటి అంటూ PVR థియేటర్ యాజమాన్యాన్ని ప్రేక్షకులు తిట్టిపోయడం హైలెట్ అయ్యింది.