Advertisementt

క్రెడిట్ అన్నగారిదే అంటున్న అభిమానులు

Mon 08th Aug 2022 07:31 PM
bimbisara,sitaramam,sr ntr  క్రెడిట్ అన్నగారిదే అంటున్న అభిమానులు
Fans say the credit goes to Sr NTR క్రెడిట్ అన్నగారిదే అంటున్న అభిమానులు
Advertisement
Ads by CJ

ప్రేక్షకులు థియేటర్స్ కి రాక, కలెక్షన్స్ లేక ఉసూరుమంటున్న తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఊపిరినిస్తూ, ఊపుని తెస్తూ లాస్ట్  వీక్ రిలీజ్ అయిన రెండు సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. బింబిసార ఫస్ట్ వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ అయ్యిపోతే.. సీతా రామం కూడా మంచి వసూళ్ల తో దూసుకుపోతుంది. ముఖ్యంగా క్లాస్ సెంటర్స్, మల్టిప్లెక్స్ ల్లో సీతారామం మూవీ కి మంచి స్పందన వస్తుంది. 

ఇటు ఇండస్ట్రీకే కాక అటు కళ్యాణ్ రామ్ కెరీర్ కి, ఇటు తెలుగునాట దుల్కర్ సల్మాన్ కెరీర్ కి మైల్ స్టోన్ గా మారాయి ఈ చిత్రాలు. అయితే విచిత్రంగా ఈ రెండు చిత్రాల విజయాలు మాత్రం అన్నగారి ఎన్టీఆర్ కి ఆపాదిస్తున్నారు అభిమానులు. ఎందుకంటే బింబిసార కళ్యాణ్ రామ్ స్థాపించిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ నుంచి వస్తే.. సీతారామం ఎన్టీఆర్ ఫోటోనే బ్యానర్ ఎంబ్లెమ్ గా పెట్టుకున్న వైజయంతి మూవీస్ నుండి రావడం గమనార్హం. అదే అంశాన్ని ప్రస్తావిస్తూ స్వర్గీయ ఎన్టీఆర్ ఆశీస్సులతోనే ఈ అద్భుత విజయాలు ఆవిష్కృతమయ్యాయని.. అభిమానులు సోషల్ మీడియాలో ఉత్సాహంగా పోస్ట్ లు పెడుతున్నారు. 

👉 Read : ఎన్ఠీఆర్ కి భారతరత్న ఇవ్వాలి - చిరంజీవి 

Fans say the credit goes to Sr NTR:

Bimbisara, Sitaramam Success Celebrations

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ