బిగ్ బాస్ సీజన్ సిక్స్ మొదలవ్వడానికి సమయం దగ్గర పడింది. రీసెంట్ గానే బిగ్ బాస్ సీజన్ 6 ప్రోమో వదిలింది స్టార్ మా. ప్రోమో తోనే నాగార్జున, బిగ్ బాస్ యాజమాన్యం అంచనాలు పెంచేశారు. గత సీజన్స్ కన్నా ఈ సీజన్ మరింత ఆసక్తికరంగా ఉండబోతున్నట్లుగా అనిపిస్తుంది. ఇక బిగ్ బాస్ సీజన్ సిక్స్ లోకి అడుగుపెట్టబోయే వారి పేర్ల లిస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే యాంకర్ ఉదయభాను పేరు గట్టిగా వినిపించడమే కాదు, ఆమెకి ఇప్పటివరకు ఎవరూ అందుకొని హయ్యస్ట్ పారితోషకం ఇవ్వబోతుననట్టుగా ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా న్యూస్ యాంకర్ ప్రత్యూష కూడా ఈ సీజన్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది.
ప్రత్యూష ప్రస్తుతం TV9 న్యూస్ ఛానెల్‌లో పని చేస్తుంది. నటిగా, యాంకర్‌గా, స్పోర్ట్స్ ఎనలిస్టుగా, యోగా ట్రైనర్‌గా ఫెమస్ అయిన యాంకర్ నేహా చౌదరి కూడా రాబోతుందట. అంతేకాకుండా సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ ఈ సీజన్ లోకి పక్కా అంటున్నారు. అలాగే యూట్యూబ్ లో ఫెమస్ అయిన వారిని, సీరియల్ ఆర్టిస్ట్ లని, సామాన్యులని కూడా సీజన్ 6 లోకి భాగం చెయ్యబోతున్నారు. మరి హౌస్ లో జరిగే కొట్లాటలు, ప్రేమలు, పేరంటాలు అంటూ ఆసక్తికరంగా ఉండబోయే సీజన్ 6 కోసం బుల్లితెర ప్రేక్షకులు వెయిటింగ్.